పది కోట్లా.? పది వేలా.? ఎమ్మెల్యే రాపాక రేటు ఎంత.?

రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుకోవడం కంటే పెద్ద బూతు ఇంకేముంటుంది.? ఏ ఎమ్మెల్యే అయినా తనను ఫలానా పార్టీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు. రాజకీయమంటేనే కప్పల తక్కెడ వ్యవహారమైపోయింది.! ఓ ఎమ్మెల్యే.. కోట్లు ఖర్చు చేసి గెలుస్తున్నాడు. ఇది బహిరంగ రహస్యం. డబ్బు ఖర్చు పెట్టకపోతే గెలవడం కష్టం. ఖర్చు పెట్టినా గెలుస్తాడన్న నమ్మకం లేదు.

కాకపోతే, ఖర్చు పెడితే, గెలిచేందుకు కాస్త అవకాశాలు మెరుగు పడతాయంతే. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నోళ్ళు, అవినీతికి అలవాటు పడరా.? అమ్ముడుపోకుండా వుండరా.? అదెలా కుదురుతుంది.? అసలు ఇప్పుడిదంతా ఎందుకంటే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీ కొనుగోలు చేసిందనేది ప్రధాన ఆరోపణ.

ఆ ఆరోపణ చేసింది కూడా వైసీపీనే. ఆ లెక్కన టీడీపీ ఎమ్మెల్యేలు నలుగుర్ని తాము కొన్నామని వైసీపీ ఒప్పుకున్నట్టే కదా.? జనసేన నుంచి వైసీపీలోకి దూకిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన రేటు పది కోట్లు పలుకుతోందని చెప్పారు. ‘నేను టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే, నాకు పది కోట్లు వచ్చేవే..’ అని చెప్పారాయన. కానీ, తాను విలువలకు కట్టుబడి జగన్ వెంట నడుస్తున్నట్లు చెప్పారు. ఆల్రెడీ అమ్ముడుపోయిన రాపాకని, మళ్ళీ మేమెందుకు కొంటాం.? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

పది కోట్లు కాదు, రాపాక రేటు పది వేలు కూడా వుండదన్నది టీడీపీ వాదన.! కెలుక్కుని కామెడీ అయిపోయారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.!