ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎందరో ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజంతా ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా సామాజిక మాధ్యమాల్లో జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓ ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశారు. జగన్‌ను బావా అంటూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మలతో కలిసి ఉన్న జగన్ చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ ‘దేశంలోనే యంగ్ సీఎం.. నేను ఎంతగానో ప్రేమించే మా బావ వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ లైఫ్ ఎంతో సంతోషకరంగా సంపన్నంగా ఉండాలి సీఎం గారూ’ అంటూ స్పెషల్ విషెష్ అందించారు మంచు మనోజ్.
ఇక మంచు మనోజ్ వదిన విరోనిక (విష్ణు భార్య) వైఎస్ కుటుంబానికి చెందని ఆడబిడ్డే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో తమ్ముడు సుధీర్ రెడ్డి కూతురే విరోనిక. జగన్, విరోనికలు అన్నదమ్ముల బిడ్డలు కావడంతో జగన్‌కి చెల్లి వరస అవుతుంది విరోనిక. మంచు విష్ణు విరోనికను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. ఈ వరసన వైఎస్ జగన్‌ను బావా అంటూ సంభోదించారు మనోజ్.