సాధినేని యామిని పదవికి కారణం..?

యువ మహిళా నేత సాధినేని యామిని.. రాజకీయాల్లోకి వచ్చి  చాల కోల్పోయానని   టీడీపీ నాయకులకు చాల సేవ చేశానని  ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి, యామిని  ఏమి కోల్పోయిందో,  ఎవరికీ సేవ చేసిందో ఆమెకే తెలియాలి. ఇక టీడీపీని కాలదన్ని బీజేపీలో చేరిన  ఈవిడ   ఏకంగా ప్రధాన మంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలో పదవి దక్కడం రాజకీయ వర్గాలను చాలా ఆశ్చర్యపరిచింది.  దక్షిణ భారత దేశంలో కాశీ ఆలయానికి కొత్త అధికారిక ప్రతినిధిగా యామిని వ్యవహరించనున్నారు. ఆలయం ఉన్న పట్టణంలో అందుబాటులో ఉన్న భక్తుల కోసం కార్యక్రమాలు – సౌకర్యాలను విస్తరించడానికి.. సేవా ప్రచారం చేయడానికి యామినికి అధికారాలుంటాయి.
 
అయితే యామిని కన్నా సీనియర్స్ చాలామంది ఉన్నారు. మరి  బిజెపి నాయకత్వం ఆమెకు కీలకమైన కాశీ ఆలయ పదవి ఇచ్చి ఎందుకు సత్కరించింది ?  ఆమె ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆలయ సమాచార ప్రచారానికి బాధ్యత వహించే అధికారం ఆమెకు ఇవ్వడం అంటే పెద్ద అవకాశమే. పైగా అది ప్రధాని మోడీ నియోజకవర్గం.  మోడీ నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలుస్తుంది. కాబట్టి సాధినేని యామిని నియామకం కూడా మోడీ కనుసన్నల్లోనే జరిగిందా ?
 

అసలు  ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డులో జాతీయ నాయకత్వం యామిని శర్మను ఎందుకు సభ్యురాలిని చేసింది ?  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నంత కాలం సాధినేని యామినికి  చంద్రబాబు సపోర్ట్ ఉంది. టీడీపీ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరాక  కూడా టీడీపీ మాజీ ఎంపీలు ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజానా చౌదరి లాంటి వారు ఆమెకు ఆ పదవి ఇప్పించారు అట. బాబు ప్రమేయం లేకుండా వారు ఎందుకు ఆమెకు పదవి ఇప్పిస్తారు. మొత్తానికి యామిని పదవి వెనుక ఉన్నది బాబునే.