సంక్షేమ పథకాల అమలులో రికార్డు సృష్టిస్తున్న జగన్ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రికార్డులు సృష్టించుతోంది. ఇందులో సామాజిక పింఛన్లు అతి ప్రధానమైనవి. ఎన్నికల్లో నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 2250 రూపాయలు ఇస్తూ ప్రతి ఏడు 250 పెంచుకుంటూ పోతామవి ఈ పథకం అమలు చేస్తున్నారు.

సామాజిక పింఛన్లు పథకం తెలుగు దేశం హయాంలో కూడా అమలు జరిగినా పంపిణీలో లోపాలు వుండేటివి. వృద్ధులు వికలాంగులు పింఛన్ల కోసం క్యూలో వుండి ఇబ్బందులు పడే వారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ ఇబ్బందులు వున్నందున పింఛన్ దారులకు ఇంటి వద్దనే బట్వాడా చేసే పద్ధతి గత నెల నుండి మొదలు పెట్టారు. ఒకటవ తేదీ కల్లా ఇళ్ల వద్దనే గత నెలలో పంపిణీ చేశారు. ప్రధమంగా మొదలు పెట్టడం కాబట్టి అందరికీ ఒకటవ తేదీన పంపిణీ జరగ లేదు. అయితే ఈ నెల ఒకటవ తేది ఆదివారం అయినా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మొహరించి ఈ నెలలో ఒకటవ తేదిన 84.65 శాతం ఫించన్ లు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు.

ఇందుకోసం 1334 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆదివారం ఒక్క రోజునే 50 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం మొత్తం మీద 58 99 65 మందికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. ఈ పింఛన్ల అంశంలో గత నెలలో ప్రభుత్వానికి ప్రతి పక్షాలకు వివాదం ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా ఆరు లక్షలపైచిలుకు మందికి ఇస్తున్నట్లు ప్రకటించింది. కాని అదే సమయంలో నాలుగు లక్షల మందికి కోత పెట్టింది. తదుపరి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి కోత పెట్టిన వారిని తిరిగి పరిశీలించుతామని చెప్పింది. తిరిగి పరిశీలనలో3. 30 లక్షల మంది అర్హత సాధించారు. వీరికందరికీ ఈనెలలో రెండు నెలల పింఛన్లు ఇచ్చారు