రాష్ట్రంలో రాజధాని గోల రోజు రోజుకూ జఠిల మౌతోంది. రాజధాని గ్రామాల రైతులు రోజు కొక తీరును నిరసన కార్యక్రమాలు నిర్వహించు తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయి. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కన్పించడం లేదు.
ఈ నేపథ్యంలో వైసిపి సోషల్ ఫోరం ఫేస్ బుక్ లో ఒక పోల్ నిర్వహించింది. ఇందులో 1.33 లక్షల మంది పాల్గొన్నారు. అమరావతి రాజధాని కావాలనా? లేక విశాఖ పట్నం రాజధానిగా వుండాలనా? అని నిర్వహించిన పోల్ లో 77 శాతం అమరావతి రాజధానిగా వుండాలన్నారు. 23 శాతం విశాఖ పట్నం రాజధానిగా వుండాలన్నారు. అయితే గురువారం తర్వాత కూడా ఈ పోల్ కొన సాగించు తున్నారు. గమనార్హమైన అంశమేమంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని టిడిపి పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం కొసమెరుపు.
A poll on the Facebook page, YSRCP Forum, seeking public opinion on the preference of Capital for AP between #Amaravati & #Visakhapatnam received 1.13 Lakh votes. 77% voted in favour of Amaravati as the #Capital. #APWithAmaravati #MyCapitalAmaravati pic.twitter.com/Jlo3Li30Gx
— Jay Galla (@JayGalla) February 7, 2020
Another #poll on YSRCP Forum on how many are in support of #cancelling the AP #Legislative #Council. 81% are against the #decision of cancelling the Council.#APWithAmaravati #MyCapitalAmaravati #SaveAndhraPradesh pic.twitter.com/54zCfTLO8F
— Jay Galla (@JayGalla) February 7, 2020