వైసిపి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ ల మీద షాక్ లు!

ఆంధ్ర లో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత కూడా 151 సెక్షన్ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని హైకోర్టు చీఫ్ జస్టిస్ పోలీసు అధికారులను నిలదీశారు. .నేరాలు చేసే వారికి నేరాలు చేసే ఆలోచన వున్న వారికి మాత్రమే ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారని ప్రతిపక్ష నేతకు ఏలా ఇచ్చారని ప్రశ్నించారు

గురువారం విశాఖ ఎయిర్ పోర్ట్ లో సంభవించిన సంఘటనలపై శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ విచారణ సందర్భంగా పోలీసుల తీరును న్యాయమూర్తి తప్పు పట్టారు. కోడిగుడ్లు టొమాటాలతో వచ్చిన వారిని ముందుకుగా ఎందుకు అరెస్టు చేయ లేదని న్యాయమూర్తి అడిగారు. వారు ఎయిర్ పోర్ట్ కు రాకుండా ఎందుకు నిలువరించ లేక పోయారని అడిగారు. అధికార పక్షానికి ఒక రూలు ప్రతిపక్షానికి మరో రూలు వుంటుందా? చట్టం ముందు అందరూ సమానమే కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వచ్చే నెల 2 వతేదికి కేసు విచారణ వాయిదా వేస్తూ ఆలోపు కౌంటర్ వేయాలని డిజిపితో పాటు విశాఖ పోలీసు కమిషనర్ను న్యాయమూర్తి ఆదేశించారు.

కారణాలు ఏవైనా కావచ్చు. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటిషన్ లు హైకోర్టులో దాఖలు అవుతున్నాయి. అది సమస్య కాదు. ఈ కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ప్రభుత్వ విధానాలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న గాక మొన్న రాజధాని పరిధిలో గల భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వ కూడదని వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కూడా న్యాయమూర్తి తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా హైకోర్టు తదితర నిర్మాణాల నిలుపుదలపై వేయ బడిన పిటిషన్ విచారణ సందర్భంగా పనులు నిలుపుదల చేయ కూడదని న్యాయమూర్తి ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం హైకోర్టు తప్పు పట్టింది. తీర్పు రిజర్వులో వుంది. తీర్పులు రిజర్వులో వుండే కేసులు చాలా వున్నాయి. ముఖ్యమంత్రి చుట్టూ ఎంతో మంది సలహాదారులు సివిల్ సర్వీస్ అధికారులు వున్నారు. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకొనే ముందు రాష్ట్రంలో ప్రతిపక్షాలు అభిప్రాయం ప్రధానం కాదు-. గాని న్యాయ స్థానాల్లో ఎంత వరకు నిలబడతాయో సూచనలు పాటించడం లేదనిపిస్తోంది!