విశాఖ వాసులకు జగన్ సర్కార్ శుభవార్త !!

విశాఖ ను రాజధానికి ప్రదిపాదిస్తున్న నేపథ్యంలో విశాఖ ప్రజలకు జగన్ ప్రభుత్వం మంచి శుభవార్త చేప్పడానికి రెడీ అయింది. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటో తెలుసా.. విశాఖ పట్టణంలో నివసిస్తున్న పేదలకు భారీగా ఇళ్ల పట్టాలు పంపిణి చేయాలనీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి లోని కాప్ కార్యాలయంలో విశాఖ మున్సిపల్ అధికారులు, హోసింగ్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది పేదలకు ఉగాది రోజున ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణి చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో లక్షమందికి పైగా పట్టాల పంపిణి పూర్తీ చేయాలనీ భావిస్తోంది. నగరంలో అవస యోగ్యమైన స్థలాలను గుర్తించి మార్కింగ్ ఇవ్వలని, ఫిబ్రవరి 15 లోగా భూ సేకరణ పూర్తీ చేయాలనీ ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేసారు. లబ్ధిదారులు కోరుకున్న స్థలాలను సేకరించాలని, ప్లేటింగ్ అనంతరం లాటరీ పద్దతిలో పట్టాలు పంపిణి చేయాలనీ అన్నారు. మొత్తానికి మూడు రాజధానుల వ్యవహారంలో విశాఖ పేదలకు మంచి గిఫ్ట్ ఇదే.