విశాఖలో వైసీపీ నాయకుల వింత నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ పాలనకు ఈ ఎన్నికలే కొలమానం కానుంటే.. ప్రతిపక్ష పార్టీకి ఇది చావో రేవో అన్న విధంగా ఉంది. రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు బలాబలాలను కూడగట్టుకుంటున్నాయి.

వైసీపీ, టీడీపీల పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో బీజీగా ఉంటే.. జనసేన మాత్రం ఓ చిత్రమైన పనికి తెరతీసింది. రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం చూపే స్థితిలో లేని బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ తాజాగా విశాఖకు సమీపంలోని గాజువాకలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులను పార్టీలో చేర్తుకుని ఆశ్చర్య పరిచింది. గాజువాకకు చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు జనసేన పార్టీలో చేరారు. అధికారం ఉన్న పార్టీని వదిలి మరీ జనసేనలో చేరిన ఆ నాయకులు జనసేన భావజాలం నచ్చడం వల్లే జనసేనలో చేరామని, ఇకపై పవన్‌ నాయకత్వంలో తామంతా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక్కడ చిత్రమైన అంశం ఏమిటంటే.. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుండి పోటీ చేసి, రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. అలాంటి చోట.. అధీ అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులు జనసేనలో చేరడం చూస్తుంటే.. అసలు ప్రభావం చూపలేదు అనుకుంటోన్న జనసేన ఈ రకంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప దీని వల్ల వైసీపీ వచ్చిన నష్టం ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే జనసేన చేసిన పెద్దతప్పని కూడా విమర్శిస్తున్నారు.

అసలు స్థానిక ఎన్నికల్లో టీడీపీ కూడా పెద్దగా పోటీ ఇవ్వలేదని, అధికార పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు ఘంటా పథంగా చెబుతున్నారు. మరి టీడీపీనే పోటీ ఇవ్వలేనప్పడు జనసేన-బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపగలదో ఎన్నికల్లో తెలుస్తుంది.