చంద్రబాబునాయుడు-లింగమనేని రమేష్ మధ్య ఉన్న క్విడ్ ప్రో కో సంబంధాన్ని వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. ఆళ్ళ మీడియాతో మాట్లాడుతూ కరకట్ట మీద ఉన్న లింగమనేని నిర్మించిన గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణమే అని టిడిపి ప్రభత్వం తేల్చేసినపుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తర్వాత అదే గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసం ఉండటంలోనే క్విడ్ ప్రో కో స్పష్టంగా తెలుస్తోందన్నారు.
అక్రమనిర్మాణాన్ని కూల్చేయాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వమే తర్వాత దాన్నే నివాసంగా మార్చుకున్నారంటే అర్ధమేంటి ? అంటూ ఆళ్ళ ప్రశ్నకు వాళ్ళిద్దరే సమాధానం చెప్పాలి. తర్వాత భూ సమీకరణలో భాగంగా లింగమనేని గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు చంద్రబాబు చెప్పటం అబద్ధమా ? అంటూ ప్రశ్నించారు.
తన భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు అప్పట్లో చెప్పుకున్న లింగమనేని ఇపుడేమో అది తన భవనమే అని చెప్పటానికి నొరెట్లా వచ్చింది ? అంటూ దులిపేశారు. తన భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసిన లింగమనేని ఇపుడు అది తన భవనమే అని చెప్పటంలో ఉద్దేశ్యమేమిటంటూ నిలదీశారు.
చంద్రబాబు-లింగమనేని కలిసే డ్రామాలాడుతున్నారంటూ ఆళ్ళ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. జగన్ కు రాసిన లేఖలోని సంతకం కూడా లింగమనేనిదేనా అనే సందేహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. మొత్తం లింగమనేని వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆళ్ళ చెప్పటం కత్త కథకు తెర లేస్తుందేమో చూడాల్సిందే.