స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ వాలంటీర్లను బాగా వాడుతోందట.. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లాగా తమ పరిధిలో ఉండే 50 ఇళ్లకు వెళ్లి ప్రతి ఒక్కరినీ వైసీపీకే ఓటు.. వేయాలని పదే పదే చెబుతున్నారట. పైగా ఓటు వేయకపోతే ఏం జరిగేది కూడా వివరించి మరీ చెబుతున్నారట
స్తానిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైకాపా నేతలు వాలంటీర్లను ఉపయోగించు కుంటున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఓటర్లను కలుస్తున్న వాలంటీర్లు వైసీపీకి ఓటు వేయకపోతే మీ సంగతి చూసుకుంటాం అన్నట్లు పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారట. మీ పెన్షన్లు, రేషన్ అన్ని సంక్షేమ పథకాలను ఇవ్వాల్సింది మేమె కాబట్టి మా సూచన ప్రకారం ఓటు వేయాలంటూ జనంపై ఒత్తడి తెస్తున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది వాలంటీర్లు ఉండగా.. వారందరికీ ఈ మేరకు అధికార వైకాపా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయగా వారు ఇప్పుడు ఆ విధుల్లోనే తలమునకలైనట్లు తెలుస్తోంది. సాధారణ విధుల నిర్వహణకు వెళ్తున్నట్లే వెళ్లి ఓట్లడగటం.. ప్రభుత్వ గౌరవ వేతనం తీసుకుంటూ ఇలా వైసీపీకి ప్రచారం చేయడం.. ఓట్లు వేయాలని కోరడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రతిపక్ష టిడిపి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరి ఇప్పటికైనా వాలంటీర్లను అధికార పార్టీ తమ పనుల కోసం వినియోగించుకోవడం ఆపుతుందో లేదో చూడాలి.