తన మాటలు, విమర్శలతో పైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. జబర్దస్త్‌తో కామెడీ చేసినా.. బతుకు జట్కా బండి చెంపలు చెల్లుమనిపించినా ఆమెకే చెల్లింది. ఇక రాజకీయాల్లో ఆమె మార్క్ మాటలు సరేసరి.
తాజాగా రోజా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ప్రతిపక్షాల వారికి విమర్శనాస్త్రం అందించడంతోపాటు సొంత పార్టీ నేతలకు ముల్లు గుచ్చుకునేలా చేసినట్లే అనిపిస్తోంది.
చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్‌లో ఓ బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. రోజా అక్కడికి వెళ్లిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రోజా నడుచుకుంటూ వస్తుంటే.. ఆమె పాదాల కింద పూలు చల్లారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్య్కులేట్ అవుతోంది. ఇందులో రోజా వెంట పెద్ద ఎత్తువ కార్యకర్తలు కూడా పాల్గొనట్లు కనిపిస్తోంది.
అయితే అభిమానులకు ఇది ఆనందంగా ఉన్నా.. జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించారంటూ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు..
చిత్తూరు జిల్లాలో రోజా వ్యవహారం శృతిమించుతోందనే చర్చ ఆ పార్టీ నేతల్లోకు ఆగ్రహం తెప్పిస్తున్నట్లు కనిపిస్తోంది.
సహచర మంత్రులను పట్టించుకోకుండా.. ఏ పని చేసినా ఆ ప్రచారం అంతా తన ఖాతాలోనే వేసుకుంటుంది అంటూ ఇది వరకే రోజాపై జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అది నిజమే అన్నట్లు.. అధికారిక కార్యకరమాలకు రోజాకు అంత ప్రాధాన్యత దక్కలేదు.
అయితే రోజా మాత్రం ప్రజల పక్షాన నిలబడి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. దాని ఫలితమే తాజాగా రోజాపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించేలా చేసినట్లు ఉంది. అయితే ప్రతి పక్షాలు దీనిపై విమర్శలు చేయడం సరేసరి.. గానీ సొంత పార్టీ నేతలే రోజా అలా పూలు చల్లించుకోవడం ఏంటి అని ప్రశ్నించడం రోజా అభిమానులకు బాధ కలిగిస్తోందట.