బిజెపితో ప్రధాని మోదీతో తీవ్రంగా తలపడుతున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు రాజ్ భవన్ మీద దాడి చేసింది.
ఈ మధ్య కాలంలో టిడిపి ఇంతగా రాజ్ భవన్ మీద దాడిచేయలేదు. ఈ రోజు ఏకంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ బిజెపి కార్యాక్రమాలకు నెలవు అయిందని ఆరోపించింది.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు తరచూ గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ను కలుస్తుండటమీద పార్టీ ఆక్షేపణ తెలింది. పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న పార్టీ ఆగ్రహాన్ని వెలిగక్కారు.
బిజెపి అధికార జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరరసింహారావు,రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆంధ్రప్రదేశ్ కు పట్టిన శని గ్రహాలని బుద్ధా వెంకన్న వర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేయాలని వారు గవర్నర్ మీద వత్తిడి తీసుకువస్తున్నారని ఆయన విమర్శించారు.
‘‘కన్నా లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చింది ..ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు.. ఇక్కడ ఏదో అల్లర్లు సృష్టించటమే పనిగా పెట్టుకున్నారు. గుజరాత్ వైపు చూడండి. మత ఘర్షణలు జరుగుతున్నాయి. గుజరాత్ లో ముస్లింలులను ఊచకోత కోసి చంపారు. అక్కడ రాష్ట్రపతి పాలన కావాలని గవర్నర్ ను కలసి అడగండి,’’ అని ఆయన అన్నారు.
గవర్నర్ బంగ్లా నుండే బిజెపి కార్యక్రమాలు మొదలవుతున్నాయి.. ప్రజలకు గవర్నర్ వ్వవస్థ మీద నమ్మకం పోయిందని ఆయన పేర్కొన్నారు.
రోజుకొక్కరు గవర్నర్ ను కలుస్తున్నారు.. రాష్ట్ర పతి పాలన కావాలి ఆంటున్నారు.. ఇక్కడ ఏమి జరిగిందని గవర్నర్ నుకలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర నుంచి నిధులు దండిగా విడుదల చేస్తున్నామని బిజెపి నేతులు టామ్ టామ్ చేస్తుండటాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.
‘‘ ఎవరి జేబుల్లో నుంచో తీసి డబ్బులు ఏమి ఇవ్వడం లేదు మీరు. మేము పోలవరానికి ఆంత ఇచ్చాము. ఇంత ఇచ్చాము అంటున్నారు. మీరిచ్చేదేమిటి? ప్రజలు కడుతున్న టాక్స్ ల నుంచి తిరిగి ఇస్తున్నారు. ఇందులో మీ గొప్ప ఏముంది? అని బుద్ధావెంకన్న అన్నారు.