రచ్చ పీక్స్..  బాబు త్వరగా  మేల్కొంటే మంచింది !  

40 యేళ్ళ అనుభవం నేర్పని పాఠాలు
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం మౌనం దాల్చారు. నేతలు కొట్లాడుకుంటున్నా.. మాటల దాడులు చేసుకుంటున్నా తనకేమీ పట్టన్నట్టుగా  బాబు సైలెంట్ గా ఉండడం ఏమిటా అని తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీల్ అవుతున్నారు.  మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.  ఇంతకీ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. అనవసరంగా నేతల గొడవల్లో వేలు పెట్టడం ఇష్టం లేకేనా ?  ఈ నేతలను చంద్రబాబు గాలికి వదిలేశాడా ? పార్టీలో అంత రచ్చ జరుగుతున్నా బాబు పార్టీ గొడవలను పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో ఇప్పటికే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నా బాబు  ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు.
 
 
బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదురు నేతలు కొంత సంయమనం పాటించారు.  కానీ బాబు ఓడిపోయిన తర్వాత సుబ్బారెడ్డి, అఖిల ప్రియల మధ్యనున్న విభేదాలు భగ్గుమన్నాయి.  తన హత్యకు కుట్రపన్నారని  సుబ్బారెడ్డి ఆరోపించడం కలకలం రేగింది.  ఈ ఆరోపణల పై అఖిల ప్రియ స్పందించినా  అవి నిరాధారమైన వివరణల్లా అనిపిస్తున్నాయి. దాంతో  అఖిల రాజకీయాల్లో కొనసాగితే.. ఆళ్లగడ్డలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని సుబ్బారెడ్డి చెబుతున్నాడు. టీడీపీ నాయకత్వం అఖిలప్రియ విషయంలో పునరాలోచన చేయాలని ఆయన కోరారు.

మొత్తానికి ఇంత రచ్చ జరుగుతున్నా..  ఇంకా టీడీపీ అధినేతలో స్పందన లేకపాయే.  చంద్రబాబు ఇలాగే  పట్టించుకోకపోతే  ఈ రచ్చ మరింత ఉదృతం అయ్యే  అవకాశం ఉంది.  పైగా కర్నూలు జిల్లాలో మిగిలిన టీడీపీ నాయకుల పై కూడా చంద్రబాబు నియంత్రణ పూర్తిగా కోల్పోయ్యే అవకాశం ఉంది.  కాబట్టి బాబు త్వరగా మేల్కొంటే మంచింది.