రంగు పడింది: వైసీపీకి హైకోర్టు అక్షింతలు !!

జగన్ ప్రభుత్వం అతి కి బ్రేకులు వేసినట్టయింది. పార్టీ గెలిచింది కదా అని చెట్టుకు, పుట్టకు, మరుగుదొడ్లకు.. చివరికి కూడా వై సిపి పార్టీ రంగులతో నింపేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా దేవాలయాల్లో దేవుళ్ళకు వీలయితే రంగులు వేయడానికి రెడీ అన్నట్టుగా ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఆ మధ్య ఓ స్కూల్ బిల్డింగ్ కు ఉన్న జాతీయ జెండా రంగులనే మార్చిన ఘనత ఆ పార్టీది.
వై సిపి, కార్యకర్తలు, మద్దతుదారుల అతి కారణంగా ఆ పార్టీపై పాళీ విమర్శలు తలెత్తాయి.

వై సిపి రంగుల పిచ్చికి హై కోర్టు మొట్టికాయలు వేసింది. వై సిపి పార్టీకే కాదు ప్రభుత్వానికి తలాంటిది. గ్రామా సచివాలయాలు, ప్రభుత్వ భవనాలకు వై సిపి రంగులు వేయడం ఏమిటి అంటూ కోర్టు మండి పడింది. తక్షణం ఆ రంగులను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రంగుల పేరుతొ ఇప్పటికే వందలకోట్లు ఖర్చు చేశారన్న అభియోగాలు ఉన్నాయని తెలిపింది. మరి ఆ రంగులను తొలగించడానికి మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేయాలి కదా !! ఇలా రంగులకోసం అయితే వందలకోట్లు ఎం ఖర్మ వేల కోట్లయినా ఖర్చు చేస్తారు, కానీ 60కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతుందన్న ఆవేదనతో శాసన మండలిని రద్దు చేస్తారు. ఒకవేళ రంగుల విషయంలో కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి సరిపోయింది .. అదే ప్రభుత్వం వేస్తె ఏకంగా కోర్టును కూడా రద్దు చేస్తారేమో వై సిపి నేతలు.