మొదలైన కోడెల డ్రామాలు

అంతా అనుకున్నట్లే సాగుతోంది కోడెల వ్యవహారం. ప్రజల, పార్టీ సానుభూతి కోసం కోడెల డ్రామాలు మొదలయ్యాయి. తన కుటుంబంపై వైసిపి ప్రభుత్వం రాజకీయ వేధింపులు ఎక్కువవుతున్నాయట. అలాగే తన ఇంటిపై వైసిపి నేతలు దాడులు కూడా చేశారట. గడచిన ఐదేళ్ళు  నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జనాలను వేధించిన విషయం మరచిపోయారు.

వేధింపుల్లో కూడా ఒకపుడు పిండారి వ్యవస్ధ అనేది ఒకటుండేది. మామూలు జనాలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు అనే కాదు చివరకు టిడిపి నేతలను కూడా వదిలిపెట్టకుండా పిండారీల్లాగ వేధించారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో కసికొద్ది జనాలు కోడెలను ఓడించారు. ఓ పోలింగ్ బూత్ లోకి కోడెల వెళ్ళినపుడు జరిగిన దాడి ఇందులో భాగమే.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు శివ రామకృష్ణ, కూతురు విజయలక్ష్మి సాగించిన అరాచకాలు అంతా ఇంతా కాదు. అందుకనే అధికారంలో నుండి దిగిపోగానే కొడుకు, కూతురుపై సుమారు 20 కేసుల వరకూ నమోదయ్యాయి. ఇంకా బాధితులు పోలీసు స్టేషన్లకు వస్తునే ఉన్నారు ఫిర్యాదులు చేయటానికి.  

ఇన్ని రోజులు సంతానం మీద మాత్రమే కేసులు నమోదయ్యాయి. తాజాగా కోడెలపైన కూడా ఓ కేసు నమోదైంది. సంతానంపై నమోదైన కేసులు అన్నీ ప్రైవేటు వ్యక్తులు పెట్టినవి. కానీ కోడెల మీద నమోదైన కేసు మాత్రం ఏకంగా ప్రభుత్వమే పెట్టింది. ప్రభుత్వ ఆస్తులను కోడెల సొంతం చేసుకున్నారంటూ ప్రభుత్వమే తుళ్ళూరు పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. దాంతో కోడెల మరింత సానుభూతి కోసం డ్రామాలు మొదలుపెట్టారు. మరి  ఈ డ్రామాలు ఎక్కడిదాకా వెళతాయో చూడాల్సిందే