మూడు రాజధానులంటే ప్రాంతీయ విభేదాలు సృష్టించడమేనా?

రాజకీయ సూత్రం ఏమంటే పరిపాలన చేతకానప్పుడు ప్రాంతీయ విద్వేషాలు సృష్టించండం …….ఇది అలా ఉంచితే….. కొంతమంది మేధావులు అపరమేధావులు నాలాంటి సామాన్యుడికి వచ్చిన అనుమానాలు నివృత్తి చెయ్యగలరని మనవి.

మన మూడు భ్రమరావతి రాజధానులకు స్ఫూర్తి సౌత్ ఆఫ్రికా. అంటే ఆ దేశం ప్రపంచంలోకెల్లా బాగా అభివృద్ధి చెందిన దేశమా, నీళ్లకోసం విలవిల్లాడుతున్న దేశం. ఇదికూడా పక్కన పెడదాం ….

మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూలులో హైకోర్టు పెట్టడం వలన రాయలసీమ కరువు తీరిపోతుందా, రాయలసీమలో వలసలు ఆగిపోతాయా, హైకోర్టుని చూసి కంపెనీలు వచ్చేస్తాయా, ఎప్పుడూ కురవని వర్షాలు మా నాయకుడు వచ్చాక కురిశాయని మొన్నటి వరకూ డప్పు కొట్టారు, కానీ ఆ నీటిని రాయసీమకు మళ్లించలేకపోయారు. కనీసం రాయలసీమలో చెరువులు కూడా నింపలేకపోయారు.

ఎక్సిక్యూటివ్ రాజధాని వైజాగ్ : పాలనా వ్యవహారాలన్నీ వైజాగ్ నుండే , మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకొని ప్రభుత్వ వ్యవస్థ అంతా అమరావతికి రావాలి పోవాలి . అసలే డబ్బుల్లేక అడుక్కుతింటున్నామని మీరే అంటారు, ఒక ముఖ్యమంత్రి శుక్రవారం నాంపల్లి కోర్టుకి వెళ్తేనే 60 లక్షలు అవుతుంటే, అసెంబ్లీ సమావేశాలకు మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేలు వారి అనుచరగణం , పి ఏ లూ అందరూ వైజాగ్ నుండి అమరావతికి రావడానికి ఎంత ప్రజాధనం వృధా అవ్వుద్దో ఆలోచించుకోండి.

రాజధాని అసలు కథ:::::: కర్నూలులో కోర్టు పెట్టినా, అమరావతిలో అసెంబ్లీ పెట్టినా, అసలురాజధాని విశాఖపట్టణమే. కర్నూలు అలాగేవుంటుంది,నిర్మాణం మధ్యలో ఉన్న అమరావతి స్మశానం గా మారుతుంది. అలాగని వైజాగ్ డెవలప్ అయిపోతుందంటే అదీ భ్రమే, ఇప్పటికే ఉన్న కంపెనీలు పోయినాయి, ఇంక రాజధాని అంటే బొమ్మలాటకింద అటూఇటూ మారుస్తుంటే ఇంటర్నేషనల్ కంపెనీలు కాదు కదా చెప్పులుకుట్టుకునే వాడు కూడా రాడు, బెంగ్లూరో హైద్రాబాదో పోతారు.
విశాఖ పట్టణంలో చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ముందుగానే వైసీపీ వారు స్వాధీనం చేసుకుని, తమకి అడ్డంగా ఉన్న జాయింట్ కలెక్టర్ ని తప్పించి మొత్తం తమ అధీనం లోకి తెచ్చుకున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి పప్పు బెల్లాల పధకాల కోసం వైజాగ్ లోని ప్రభుత్వభూమి 4000 ఎకరాలు అమ్మేస్తున్నారు. 2015 లో చంద్రబాబు అమరావతిలో చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇప్పుడు వైజాగులో వైసీపీ చేయబోతుంది. అయినా కొన్ని గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనేవున్నాయి.

దమ్మున్న సీఎం అయితే ఏంచెయ్యాలి. చంద్రబాబు అమరావతిలో చేసిన అవినీతిని బయటకు తీసి తప్పుచేసినోన్ని బొక్కలో వేసి, అమరావతిని పూర్తిగా డెవలప్ చెయ్యాలి. ప్రతీ జిల్లాకి కంపెనీలు పట్టుకుని రావాలి, పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసే కంపెనీలు అన్ని జిల్లాలకీ కావాలి .అప్పుడు అన్ని పట్టణాలు డెవలప్ అవుతాయి, అంతేకాని కర్నూలులో కోర్టు, వైజాగ్ లో సెక్రటేరియట్, అమరావతి అసెంబ్లీ ఇవి అభివృధికి పనికిరావు, ఇవి కేవలం పరిపాలనకోసమే. ఇలాంటి వాటితో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు.

వారు, వారి పిల్లలు , వారి ఆస్తులు, బెంగళూరులో హైదరాబాద్లో , సౌత్ ఆఫ్రికా పక్కన ఉన్న మడగాస్కర్ లో బానేవున్నాయ్ . మరి మనపిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళనీ ఇప్పటినుండే గొర్రె బానిసత్వానికి అలవాటు చేద్దామా. నాయకుడి మీద అభిమానంతో పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుందామా. సమాజానికి మంచి చేస్తే మంచివాడు అంటాం. చెడు చేస్తే ఎవడైనా చెడ్డవాడే. నేను నమ్మిన పవన్కళ్యాణ్ ని అయినా నేను నిరసన తెలుపుతా, సమాజానికి చెడు చేసే నాయకుడిని ఎదిరించే దమ్ములేకపోతే నీవల్ల సమాజానికి ఉపయోగం లేదు

చివరిగా ఒక మాట : వైజాగ్ లో ఇప్పటివరకూ ఎన్ని తుఫాన్లు వచ్చాయో నాకైతే తెలియదు, రాష్ట్రంలో ఎక్కడైనా తుఫానో వరదలో వస్తే రాజధాని నుండి అధికార యంత్రాగం వెళ్లి పునరావాస పనులు చేస్తారు. మరి అలాంటి తుఫానులో రాజధానే కొట్టుకు పోతే ……..

This is a view expressed by Jansena Member

Rajendra Polnati Jsp