ముదుసలి ధీరుడే అంత.. ఇక జేసీ ఎంత ?

 
ప్రపంచానిది ఒక  బాధ అయితే,  మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిది ఒక బాధ. ఆయన వ్యాఖ్యల ముందు జంధ్యాల హాస్య ప్రవచనాలు కూడా దిగదుడుపే అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా ఆయనగారు మాట్లాడుతూ..  ‘ఏపీకి జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు 110 మార్కులు వేస్తానని అన్నారు. వంద మార్కులకు  పది మార్కులు ఎక్కువ ఎలా వేస్తాడో ఆయనకే తెలియాలి. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటాన్ని జగన్ మానుకోవాలని జేసి, జగన్ కు సూచనాలు కూడా చేసాడు.
 
ఈ సందర్భంగా జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని, చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని,  టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ.సుబ్బారెడ్డి పై జగన్ ఒత్తిడి తెచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమం పై దృష్టిసారించారని, సంక్షేమానికి ఓట్లు పడవన్న విషయం గత ఎన్నికల్లోనే  తేలిందని జేసీ చెప్పుకుంటూ పోయారు. ఏమైనా ఎపుడు ఏం మాట్లాడుతారో జేసీకే తెలియదు. 
 
అధికారంలోకి వస్తే బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని దిక్కుమాలిన కామెంట్స్ చేసిన హిస్టరీ మన జేసీగారిది. ఆయన ఎప్పుడూ తన హోదాని, వయస్సును   మరచి మతిభ్రమణంతో మాట్లాడుతుంటారని మనం సరిపెట్టుకోవాలేమో.  అయినా 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు అనే  ముదుసలి ధీరుడు వీరుడే  వేదిక ఎక్కితే  హుందా తనాన్ని మర్చిపోతున్నారు. ఇక జేసీ ఎంత !