మద్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 నుండి 29 వ తేదీ వరకు మద్యం దుకాణాలకు సరఫరా ఉండదని ప్రకటించింది. ఎన్నికల్లో ఓటర్లు మద్యం, డబ్బు ప్రలోభాలకు గురికాకూడదనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే వచ్చారు. స్థానిక ఎన్నికలు దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఆ మేరకే.. ఈ నెల 21 నుంచి పోలింగ్ మొదలవుతుంది. 21 ఎంపీటీసీ, 23న మున్సిపల్, 27, 29 తేదీల్లో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది కాబట్టి 12 నుండి ఆయా తేదీల్లో మద్యం సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుని ఓ సరికొత్త అధ్యాయానికి తెరతీశారు.