బ్రేకింగ్ న్యూస్ : కోడెల ఇంట్లో కంప్యూటర్లు దొంగతనం

కోడెల ఇంట్లో భద్రంగా ఉన్న అసెంబ్లీ కంప్యూటర్లు దొంగతనం జరిగింది. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల తన ఇంట్లో పెట్టుకున్న విషయం తెలిసిందే. వైసిపి వాళ్ళేమో దీన్ని దొంగనంగా చెబుతుంటే ఫర్నీచర్ కు అసెంబ్లీలో భద్రత లేదు కాబట్టే తన ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలోను పెట్టుకున్నట్లు కోడెల బుకాయిస్తున్నారు. సరే కోడెల చెప్పినట్లే భద్రత కోసమే ఇంట్లో పెట్టుకున్నాడనే అనుకుందాం. మరి ఇపుడు తన ఇంట్లో జరిగిన దొంగతనంపై కోడెల ఏమని సమాధానం చెబుతారు ?

నిజానికి కోడెల చేసిన పనిని మరెవరైనా చేసుంటే దాన్ని కచ్చితంగా దొంగతనమనే అంటారు. కేసు నమోదు చేస్తే పోలీసులు దొంగను పట్టుకుని ఉతికేసుంటారు. కానీ ఇక్కడ రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిలో పనిచేసిన వ్యక్తి కదా ? అందుకనే ప్రభుత్వమైనా పోలీసులైనా కోడెల విషయంలో ఆ పనిచేయలేకపోయారు.

హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ తరలినపుడు ఫర్నీచర్ ను కూడా నాలుగు లారీల్లో తరలించారు. అందులో ఓ లారీ మిస్ అయిపోయింది. అపుడు మిస్ అయిపోయిన లారీ ఫర్నీచర్ కోడెల ఇంట్లోను, కొడుకు శివరామకృష్ణ హోండో షో రూమ్ లోనే తేలాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారం మారగానే ఫర్నీచర్ మాయం విషయం సీరియస్ అయ్యింది. దాంతో ఫర్నీచర్ తన ఇంట్లో, క్యాంపు కార్యాలయంలో వాడుకున్నట్లు కోడెల ఒప్పుకోవటం విచిత్రంగా ఉంది. సరే దానిపై పోలీసులు కేసు కట్టి విచారణ జరుపుతున్నారు లేండి.

అయితే ముందుగా కోడెల ఇంట్లోని ఫర్నీచర్, కంప్యూటర్లను తిరిగి అసెంబ్లీకి తెచ్చేందుకు అధికారులు శుక్రవారం ఉదయం కోడెల ఇంటికి వెళ్ళారు. అయితే గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత కోడెల ఇంట్లో కంప్యూటర్లు దొంగతనం జరిగినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దాదాపు ఐదేళ్ళు భద్రంగా ఉన్న కంప్యూటర్లు అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళే ముందురోజే దొంగతనం జరిగిందంటే ఏమిటర్ధం ?