మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. పోలీస్ కేసు!

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్ బాబు మేనేజర్ ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. లక్షల రూపాయల నగదుతో పాటు నగలు చోరికి గురయ్యాయనీ, తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చాలాకాలం నమ్మకంగా పనిచేసిన ఓ వ్యక్తి రూ.2 లక్షలు దొంగతనం చేశాడు.