పైర్ బ్రాండ్ అనిత రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారబోతున్నారా..? గత ఎన్నికల్లో చేజారిన చోటును పట్టుబట్టి సాధించుకున్న ఆమె… అదే చోట నిలబడతారా? లేక ఒత్తిళ్లను తట్టుకోలేక జంప్ అయిపోతారా? ఇప్పుడు ఈ అంశమే పాయకరావు పేట నియోజక వర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఓ స్కూల్ టీచర్ స్థాయి నుండి 2012లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా ఎస్సీ నియజకవర్గం పాయకరరావుపేట నుండి పోటీ చేసి గెలిచారు. నియోజక వర్గంలో గ్రూపు రాజకీయాలను తట్టుకుని బలమైన నేతగా ఎదిగారు. రోజాకు ధీటుగా సమాధానం చెప్పి సెటైర్లు పేలేమి. రోజుల తరబడి మా గుర్తింపు లభించింది. అనిత తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు.
అయితే 2019 నాటికి నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయి. పార్టీలో చేరికలు, మరి కొన్ని సమస్యల కారణంగా బంగారయ్య కోసం అనిత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుండి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సామాజిక సమీకరణలు, విశ్లేషణలతో తిరిగి అనితను పాయకరావు పేట ఇంఛార్జిని చేసింది తెలుగు దేశం పార్టీ అధిష్టానం. అలాగే రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిని కూడా చేసింది. దీంతో డాక్టర్ బంగారయ్య వైసీపీలో చేరారు. అనిత మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే బంగారయ్య వెళ్లిపోవడంతో అనితకు పెద్ద రిలీఫ్ లభించింది. నియోజక వర్గంలో తనకు ఎదురు చెప్పే వారు వెళ్లిపోవడంతో ఇక భవిష్యత్తులో సమస్యలు ఉండవని భావించింది.
అయితే.. మాజీ ఎమ్మెల్యేలను, అందునా నియోజక వర్గాల్లో బలంగా ఉన్న నేతలను ఆహ్వానించడంలో వైకాపా దూకుడుమీదుంది. అందులో భాగంగానే అనితను కూడా వైకాపాలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. ఒత్తిడి చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అనితకు టీడీపీలో ఏ అడ్డూ లేకుండా పోయింది. మరి మళ్లీ ఆమె వైకాపాలో చేరితే సేమ్ అక్కడ కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కోక తప్పదు. మరి ఈ సిచ్యువేషన్‌లో అనిత ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది త్వరలోనే తేలనుందని టాక్.