ఫ్మార్మా కంపెనీలకు రెక్కలు వచ్చాయి. మందుల ధరల పై గరిష్ట ధరను యాభై శాతం వరకు పెంచుకునేందుకు ప్రభుతవం నుంచి అనుమతి లభించింది. ఎట్టకేలకు భారత ఔషద ధరల నియంత్రణ మండలి ఈ పెంపు పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 9 న నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారులు అ అంశం పై తుది నిర్ణయానికి వచ్చారు. అధికారులంతా సమావేశమై ధరను పెంచే పనిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షయవ్యాధి, విటమిన్ సి, మెట్రోనిడాజోల్ మరియు బెంజైల్పెనిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్, యాంటీ-మలేరియల్ డ్రగ్ క్లోరోక్విన్ మరియు కుష్టు మందుల డాప్సోన్, బిసిజి వ్యాక్సిన్ వంటి రోగాలకు ఇది వర్తిస్తుంది.
అంటే దాదాపు అన్ని పెద్ద పెద్ద యాంటి బయోటిక్స్ మీదే ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణాంతక వ్యాధులైన క్షయ, యాంటి మలేరియల్ డ్రగ్ కల్ఓరోక్విన్ ఇలాంటి వాటి పై ధరలు పెంచడం వల్ల సామాన్యులకు కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఇవన్నీ కాస్త కాస్ట్‌లీ జబ్బులనే చెప్పాలి మరి వీటి పై ధరలు పెంచడంలో ప్రభుత్వ నిర్ణయం అన్నది ఏ మేరకు సబబు అన్నది తెలియాలి. అలాగే బిసిజి వ్యాక్సిన్, కుష్షు అనేవి కూడా కాస్త అవసరమైన మందులే మరి ఇలాంటి మందుల పై ఎందుకు ధరలు పెంచారు దీని వెనకున్న ఆంతర్యమేమిటో తెలియదు. ఓ పక్క ఇలాంటి వ్యాధులు ఉన్న వారికి ఫ్రీ సర్వీస్‌ను అందిస్తూనే మరో పక్క ధరలు పెంచారు. ప్రభుత్వ హాస్పత్రిలో మందులు చాలా వరకు ఉచితంగా ఇచ్చినప్పటికీ కొన్ని అందుబాటులో ఉండని సమయంలో ప్రైవేటుగా కొనవలసి వస్తుంది. అలాంటి సమయాల్లో రోగులకు ఇది చాలా ఇబ్బంది కరమనే చెప్పాలి. ఎక్కువ ధరలు ఉండడంతో రోగి మందులను కొనలేని పరిస్థితుల్లో ప్రాణాంతక వ్యాధులు కాబట్టి రోగం ముదిరి చనిపోయే అవకాశాలు కూడా కాస్త ఎక్కువే. దీని పైన సర్కారు దృష్టి సారిస్తే బావుంటదని కొందరి అభిప్రాయం.