ప్చ్..  ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడో  ?   

 
కరోనా మహమ్మారి విజృంభన ఇంకా ఆగకపోయినా  ప్రభుత్వాలు మాత్రం  లాక్ డౌన్ లో  మరిన్ని సడలింపులతో ముందుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రోజురోజుకు ఎక్కువ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం.  ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారే  ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. వారి వల్ల స్థానికులకు కూడా కరోనా సోకే అవకాశం ఉంది, మరి ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
 
ఒకపక్క  రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూను పరిమిత ఆంక్షలతో మరికొన్ని రోజులు సడలించాలి కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే  రాష్ట్రంలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతారా ? లేక రెడ్ జోన్స్ లో లాక్ డౌన్ ను ఇంకా కఠినతరం చేస్తారా అనేది కాసేపట్లో తేలనుంది. ప్రస్తుతం  కేసీఆర్  మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ సమీక్షలో  ఈ నెల 31వ తేదీతో లాక్ డౌన్ ముగుంపు పై  కరోనా కేసుల వ్యాప్తి పై  కేసీఆర్ చర్చిస్తున్నారు.
 
ఈ సమీక్ష అనంతరం కరోనా పై  తదుపరి కార్యాచరణ గురించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న మాట వాస్తవం. కానీ, కరోనా శరవేగంగా వ్యాపించే వ్యాధి. గత 14 రోజులుగా కేసులు నమోదు కాని పలు జిల్లాల్లో కూడా నిన్న కేసులు నమోదు అయ్యాయి, దీని బట్టి కరోనా ప్రభావం అంచనా వెయ్యొచ్చు.
 
ప్రజల్లో ఆందోళన మొదలై  వారి జీవన గమనం తప్పకముందే,  ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా నియంత్రణ కొరకు పలు కీలక చర్యలను ప్రకటించి,  వాటిని అంచరించడానికి తగిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసి సరిపెట్టకుండా  వాటిని పక్కాగా ఆచరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్టంలో వ్యాపార, వాణిజ్య సేవలు ప్రారంభమవ్వడంతో జన సంచారం భారీగా పెరిగింది. మరి కరోనా పెరగకుండా కేసీఆర్ ఏం చేస్తాడో చూడాలి.