పోలవరం పై విచారణకు హై కోర్టు ఆదేశం

అనుకున్నంతా జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది.  ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై  సామాజిక ఉద్యమ నేత పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హై కోర్టులో ఓ పిటీషన్ వేశారు. దానిని పరిశీలించిన హై కోర్టు వెంటనే విచారణ జరిపి నిజాలు తెల్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేసింది.

ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఎప్పటి నుండో వైసిపి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే అధికారంలోకి రాగానే జరిగిన అవినీతిపై అధ్యయనం చేయటానికి నిపుణుల కమిటిని కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు నెల రోజులు అధ్యయనం చేసిన కమిటి వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నిర్ధారించింది.

కమిటి రిపోర్టు రాగానే చంద్రబాబునాయుడు, రాష్ట్ర బిజెపి నేతలు జగన్ కు వ్యతిరేకంగా ఒకటే గోల మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకుంటున్నారంటూ ప్రధానమంత్రి చేసిన ఆరోపణలను కూడా బిజెపి నేతలు పట్టించుకోవటం లేదు.

ఈ నేపధ్యంలోనే పుల్లారావు పిటీషన్ వేయటం దానిపై హై కోర్టు స్పందించి కేంద్ర జలశక్తి శాఖ ద్వారా విచారణకు ఆదేశించటం కీలక పరిణమంగానే చూడాలి. అంటే జగన్ ఇంతకాలం చేస్తున్న ఆరోపణలకు హై కోర్టు ద్వారా కూడా మద్దతు దొరికినట్లే భావించాల్సుంటుంది.