వైసిపిలో కొనసాగే విషయంలో మాజీ మంత్రి, సీనియర్ నేత దగ్గుబాటికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. దగ్గుబాటి పార్టీలో కీలకంగా ఉండాలంటే ఆయన భార్య పురంధేశ్వరి వెంటనే బిజెపికి రాజీనామా చేసి వైసిపిలో చేరాల్సిందేనంటూ గట్టిగా చెప్పారని సమాచారం.
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి దగ్గుబాటి పెద్దగా యాక్టివ్ గా కనబడటం లేదు. దానికితోడు ఎన్నికల సమయంలో వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన రావి రామనాధంబాబు మళ్ళీ వైసిపిలో చేరటం కూడా దగ్గుబాటికి ఇబ్బందిగా మారింది. పార్టీలో పునఃప్రవేశించిన రామనాధంబాబు బాగా యాక్టివ్ అయిపోవటంతో దగ్గుబాటిలో భవిష్యత్తుపై టెన్షన్ పట్టుకుంది.
దాంతో తన భవిష్యత్తుపై జగన్ నుండి హామీ తీసుకుందామని ప్రయత్నిస్తున్న దగ్గుబాటికి ఇన్ని రోజులు అవకాశం రాలేదు. మొత్తం మీద గురువారం జగన్ తో దగ్గుబాటి భేటి అయ్యారు. ఆ సమయంలో భార్యా, భర్తలు ఒకేపార్టీలో ఉండాలని చెప్పారట. దగ్గుబాటిలో వైసిపిలో ఉన్నట్లే పురంధేశ్వరి బిజెపిలో కంటిన్యు అవుతున్నారు.
అయితే ఇద్దరి పరిస్ధితి దాదాపు ఒకటేలాగుంది. అందుకనే వైసిపిలో కీలకంగా మారాలంటే పురంధేశ్వరితో రాజీనామా చేయించి వైసిపిలో చేర్పించటమని గట్టిగా చెప్పేశారట. మరి దగ్గుబాటి ఏం చేస్తారో చూడాల్సిందే.