నిన్న మండలిలో చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం రాబోయే కాలంలో తెలుగుదేశంకు ప్రతికూలంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల్లో లాభనష్టాలు ఎలావుంటాయో పక్కనపెడితే అసెంబ్లీలో ఇకమీదట జరగబోయే అన్ని సమావేశాల్లో టీడీపీ ఆత్మరక్షణలో పడే అవకాశం వుంది.
అసెంబ్లీ లో స్పీకర్ మండలిలో చైర్మన్ ఒక పార్టీ తరఫున ఎన్నికైనప్పటికీ వారి స్థానాల్లో పార్టీరహితంగా వ్యవహరించాల్సిన నింబంధన వుంది. ఈ మధ్య కాలంలో అలంటి వ్యవహారం మోతాదు తగ్గిన కనీసం ఆలా కనపడేలా స్పీకర్లు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే నిన్న మండలిలో జరిగిన పరిణామాలు మరియు చైర్మన్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపాలని తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విలువలు పతనానికి మరొక ముందడుగు అనుకోవాలి. చైర్మన్ తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసి కూడా తన విచక్షణ అధికారాలు వాడుతున్నాను అని చెప్పడం రాబోయేకాలంలో ఈ వ్యవ్యస్థలను మరింత దిగజారి ప్రవర్తించడానికి ఒక రిఫరెన్స్ గా మిగిలిపోతుంది.
అసెంబ్లీలో తక్కువ భలం వున్న టీడీపీ తనకు మాడ్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని స్పీకర్ తో ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వాదిస్తూ వచ్చేది. నిన్న టీడీపీ డైరెక్షన్లో చైర్మన్ వ్యవహరించిన విధానాన్ని ఇక మీదట వైసీపీ ప్రతిరోజు టీడీపీ కి గుర్తు చేసి టీడీపీ సభ్యులని అసెంబ్లీలో ఆత్మరక్షణలో పడేసే అవకాశం వుంది. మండలి పరిణామాలతో ఇప్పుడు అసెంబ్లీ లో దొరుకుతున్న అరకొర అవకాశాలు కూడా టీడీపీ కి కరువయ్యే పరిస్థితికి తెచ్చుకున్నారు