టీడీపీకి జగన్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు..?

జగన్ ఏది అనుకుంటే అది చేస్తాడు.. వెనక్కి తగ్గడు అని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పే మాట కొన్ని అంశాల్లో నిజమే అనిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే.. ఏపీ సీఎం జగన్ నిర్ణయాలకు అనుగుణంగానే కేంద్రం స్పందించింది. జగన్ కోరగానే కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీడీపీ అధినేత, ఆ పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.. ఇంతకీ జగన్ ఏం కోరారు.. అమిత్ షా దేనికి ఆదేశాలు జారీ చేశారు..?

ప్రస్తుతం దేశమంతా కరోనా ఆందోళనలు రేపుతోన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతాపాటు మరో అంశం చర్చనీయాంశం అవుతోంది.
రాజధాని అమరావతి భూముల అంశంలో వైెస్ జగన్ నిర్ణయానికి కేంద్ర హోం శాఖ అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో సిబిఐ విచారణ జరిపిస్తామని గతంలో జగన్ చెప్పినట్లే.. కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. ఆ లేఖకు హోమ్ మంత్రి అమిత్ షా అనుకూలంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించారు.

రాజధాని మార్పు అంశం స్థానిక ఎన్నికల సమయంలో కాస్త పక్కకి పోగా.. కరోనాతో అందరి దృష్టి దానిపైకే మళ్లింది. లాక్ డౌన్ స్టేజ్‌కి వచ్చింది. అయిచే ఈ సమయంలోనే కేంద్రం హోం శాఖ అనూహ్యంగా.. గతంలో ఏర్పాటు చేసిన సిబిసిఐడి విచారణలోని అంశాలు, కేబినెట్ సబ్ కమిటీ పంపిన రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటూ.. సిబిఐ విచారణకు అంగీకరించింది.

దీంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ ముఖ్య నేతలకు గట్టిగానే షాక్ ఇచ్చినట్లైందని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి టీడీపీ నేతలకు షాక్ తగిలిందో లేదో గానీ పైకి మాత్రం.. ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని, ఎలాంటి ఎంక్వైరీలు చేసినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాస్తవాలు సీబీఐ విచారణ మొదలైతే గానీ బైటికి రావు. ఇదంతా చూస్తుంటే.. ఒక్క పీపీఏల్లో తప్ప జగన్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంది అన్నది అర్థమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.