జగన్ సర్కార్ కు విశాఖ రైతుల షాక్ ?

ఎపి రాజధానిగా అమరావతిని కాకుండా మూడు రాజధానులను ప్రకటించిన ఎపి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే విశాఖ లో పరిపాలన కేంద్రంగా మార్చేందుకు జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకోసం భూముల సేకరణ మొదలు పెట్టిన జగన్ సర్కారులు అక్కడి రైతులు షాక్ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ విశాఖ రైతులు తమ భూములు ఇవ్వమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పద్మనాభ మండలం తుని వలస పంచాయితీ నరసాపురం గ్రామంలో ఉన్న 181 ఎకరాలా భూమిని సేకరించడానికి వెళ్లిన అధికారులు గ్రామా సభ నిర్వహించారు. అయితే తమకు ఇన్నేళ్లు జీవన ఆధారంగా ఉన్న భూములను మీకిచ్చి మేమెక్కడికి వెళ్లాలని వారు అధికారులను నిలదీశారు.

అధికారులు అక్కడి రైతులకు ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ గ్రామస్తులు ఎవరు భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో అధికారులు అక్కడినుండి వెళ్లిపోయారు. మొత్తానికి విశాఖ లో రైతులు ఎదురు తిరగడంతో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమరావతికి అనుకూలంగా ఉన్న రైతులు కూడా వైజాగ్ రైతులతో కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.