జగన్ చంద్రబాబు ఇద్దరికి ఒకటే సమస్య?

ChandraBabu Dangeorus plan On YS Jagan

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA NRC NPR లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీ రెండు మూడు రోజులుగా రక్తసిక్తమైంది. మంగళవారం సాయంకాలానికి అల్లర్లలో తొమ్మిది మంది చని పోయారు. ఇప్పట్లో అల్లర్లు ఆగేటిగా లేదు. ఈ అల్లర్లు ఇతర ప్రాంతాల విస్తరించితే పెనుముప్పు లేక పోలేదు.

కేంద్ర ప్రభుత్వం CAA ఆమోదించే సమయంలో రాష్ట్రంలోని అధికార ప్రతి పక్షాలు రెండూ పార్లమెంటులో వత్తాసు పలికాయి. రెండు పార్టీల రాజకీయ అవసరాలు అటువంటివి. కాని క్రమేణా దేశం మొత్తం మీద వ్యతిరేకత అందుకొనింది. ఈ పూర్వ రంగంలో ఇటీవల తెలంగాణ శాసన సభ వ్యతిరేకంగా తీర్మానం చేసింది. తాజాగా బిజెపి భాగస్వామ్యం వున్న బీహార్ శాసన సభ NRC కి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో కూడా ఇటువంటి తీర్మానం చేయాలని బయట నుంచే కాకుండా తన స్వంత పార్టీ నుండి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి వస్తోంది. ఇటువంటి తీర్మానం చేయకపోతే మైనార్టీల్లో ప్రాబల్యం పోతుందని వీరు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే మాట్లాడలేదు. సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి మాత్రం తమది లౌకిక పార్టీ అని శాసన సభలో తీర్మానం చేస్తామని చెప్పారు.

ఈ లోపు పులి మీద పుట్రలాగా బిజెపి భాగస్వామ్యం వున్న బీహార్ శాసన సభ NRC కి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. త్వరలో అమలుకానున్న జాతీయ జనాభా పట్టిక NPR విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. NPR ను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కాకుండా 2010 నాటి విధానంలో కొద్ది మార్పులతో అమలు చేయాలని తీర్మానించింది.

NDA లో వున్న రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అదే సమయంలో పక్కనే వున్న తెలంగాణ ఈ పాటికే వ్యతిరేకంగా తీర్మానం చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కూడా విధిగా తీర్మానం చేయవలసివస్తోంది. అయితే అటు ముఖ్యమంత్రి ఇటు ప్రతిపక్ష నేత ఇద్దరూ గతంలో CAAను బలపరచి వున్నారు. వాస్తవంలో ఇద్దరికీ కేంద్రంతో రాజకీయ అవసరాలు వున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదన సాఫీగా ముందుకు పోవాలన్నా శాసన మండలి రద్దు త్వరగా ఆమోదం పొందాలన్నా మోదీ షా ద్వయం అండ కావాలి. వారికి కోపం తెప్పించే చర్య పైగా ఢిల్లీ రాజధాని అల్లర్లతో తగలబడుతున్న సమయంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఈ లాంటి తీర్మానం ఆమోదించితే పరిస్థితి ఏలా వుంటుందో చెప్పలేము.

అంతేకాదు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ముఖ్యమంత్రిని మించి వుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూటిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లక్ష్యం చేసుకొని ఐటి దాడులు జరిగాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హోల్ సేల్ గా అయిదు ఏళ్ల పరిపాలనపై విచారణకు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేపు శాసన సభలో ఏ వైఖరి తీసుకున్నా కూడా చిక్కు సమస్యే. ఈ పాటికే మైనార్టీ లు టిడిపి కి దూరమై వున్నారు. మున్ముందు శాసన సమావేశాల్లో ఇరువురు నేతలు ఏ వైఖరి తీసుకొంటారో చూడాలి.

జగన్ చంద్రబాబు కి సహజంగా ఒకరి సమస్య అయితే ఇంకొకరికి మేలు కలుగుతుంది. కానీ CAA వాళ్ళ జగన్ మరియు చంద్రబాబు ఒకే విషయంపై ఒకే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు.