జగన్ కోసం బీజేపీ నడుం బిగిస్తుందా !

Modi and YS Jagan
శ్రీశైలం నీటి తరలింపు కోసం వైఎస్ జగన్ కొత్త ప్రాజెక్ట్ కట్టాలని తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఇరు ఏపీ, తెలంగాణల మధ్య వేడిని పెంచింది.  అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశంలో జోక్యం చేసుకుంటున్నాయి.  భాజాపా సైతం ఈ అంశంలో క్లియర్ స్టాండ్ తీసుకుంటోంది.  తెలంగాణ భాజాపా నేతలు ఏపీ పాజెక్ట్ కడతామంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నారా అంటూ తెరాస మీద యుద్దానికి దిగితే ఏపీ భాజాపా మాత్రం శ్రీశైలం మీద తెలంగాణకు ఎలాంటి హక్కూ లేదని అంటోంది.  
 
భాజాపా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీశైలం మీద పూర్తి హక్కులు ఆంధ్రాకే ఉన్నాయని, జీవో నెం 203 విషయంలో తెలంగాణ సర్కార్ మూర్ఖంగా వ్యవహరించడం సరైనది కాదని, అసలు తెలంగాణకు శ్రీశైలంలో నీటిలో ఎలాంటి హక్కులు లేవని తేల్చి పారేశారు.  అంతేనా వైఎస్ జగన్ చర్యను పొగుడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని అవసరం అయితే భాజాపా తరపున కేంద్రానికి లేఖ రాస్తామని అంటున్నారు. 
 
అన్నట్టే కేంద్రానికి ఏపీ భాజాపా జగన్ చర్యలను సమర్థించమని కోరుతూ లేఖ రాస్తే తెలంగాణ భాజాపా ఊరుకోదు.  వాళ్ళు కూడా ఈ వాటర్ వార్లో తెలంగాణకు సపోర్ట్ చేస్తే మైలేజ్ పెరిగే ఛాన్సుందనే ధోరణిలో వెళ్తారు.  మరి కేంద్రం తనకు అంతో ఇంతో విధేయంగా ఉన్న జగన్ వైపు మాట్లాడుతుందో లేదో చూడాలి.