జగన్మోహన్ రెడ్డిని ఉతికి ఆరేసిన “ది ఎకనమిక్ టైమ్ మ్యాగజైన్”

ఎందుకో గాని జాతీయ మీడియా ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కత్తి గట్టింది. ఇటీవల కాలంలో విమర్శలు ఎక్కువైనవి. పైగా లక్షలు వ్యయం చేసి జాతీయ మీడియా వద్ద లాబీ చేసేందుకు ఒక ప్రముఖ జర్నలిస్టు వున్నా ఫలితం దక్కడం లేదు. కాని పారిశ్రామిక రంగంలో ముఖ్యమంత్రి అవలంభిస్తున్న విధానాలను జాతీయ మీడియా తూర్పాన పడుతోంది. ఆ మధ్య జాతీయ మీడియాలు సంపాదకీయాలు రాసి సంచలనం సృష్టించాయి. కాని ఇందుకు జవాబు చెప్పుకోలేని వైసిపి నేతలు చంద్రబాబు నాయుడు ప్రభావితం చేసి రాయిస్తున్నారని ఆరోపించి తప్పించు కున్నారు. తుదకు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ సంస్థను కూడా చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని ప్రకటించి అమాయకత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా చంద్రబాబు నాయుడుకు లేని కీర్తి కట్ట బెట్టారు.

తాజాగా ది ఎకనమిక్ టైమ్ మ్యాగజైన్ లో జి. సీతారామన్ ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ ఎవరు రాసినా పబ్లిష్ చేసిన మీడియానే ప్రధానం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాల వల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకుతున్నారని వున్న పెట్టుబడిదారులు కూడా రాష్ట్రం నుండి వెళ్లి పోయేందుకు సిద్ధమౌతున్నారని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ ప్రపంచ బ్యాంకు సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం మేరకు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం వుండినదని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరణ ఇచ్చింది.