చురుకైన తెదేపా ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

చురుకైన తెదేపా ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు

తెలుగుదేశం పార్టీలో ఉన్న అత్యంత చురుకైన నాయకుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒకరు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేశవ్ అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట తన పదునైన విమర్శనాస్త్రాలతో రాజశేఖర్ రెడ్డి  ప్రభుత్వం మీద తీవ్రమైన దాడి చేసేవారు.

ప్రస్తుతం రాయలసీమ నుండి తెలుగు దేశం తరఫున గెలిచిన ముగ్గురు ప్రజాప్రతినిధుల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. ఇటువంటి సమయంలో ఎంతో చురుకుగా ఉండి పార్టీకి రాయలసీమ ప్రాంతంలో అండగా ఉండవలసిన సందర్భం.

అయితే కేశవ్ తన సహజ సిద్ధమైన దూకుడు తగ్గించి అటు అసెంబ్లీ లో కానీ ఇటు అసెంబ్లీ బయటగాని సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఇది కేశవ్ మీద అ రెండు పార్టీలను పార్టీ బయట అనుమానించే దానికి ఒక అవకాశం కల్పిస్తుంది.

ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ నిజం చేస్తూ పయ్యావుల కేశవ్ మూడు సార్లు గెలిస్తే మూడు సార్లు ప్రతిపక్ష సభ్యుడు గాని ఉండవలసి వచ్చింది. అంచేత కేశవ్ తన చేయాలనుకుంటున్న అభివృద్ధి సాధ్యపడడం లేదని ఈసారి ఎలాగైనా అధికార పార్టీ ఎమ్మెల్యే అనిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. 

అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసైనా వైసీపీలో చేరి తిరిగి ఎన్నిక కావాలన్నదే కేశవ్ ప్రయత్నం అట. అయితే వైసీపీ నేతలు ఈ విషయంలో గతంలో వైసీపీ తరఫున ఉరవకొండ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన విశ్వేశ్వర్ రెడ్డిని ఒప్పించిన తర్వాతే కేశవ్ ని పార్టీలోకి తీసుకోవాలి అనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీని మీద అ ఏదో ఒక నిర్ణయం వెలువడే వరకు కేశవ్ తన దూకుడు తగ్గించి సైలెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నారట.