చంద్రబాబు-జగన్…ఎవరిపై ఎవరు కక్ష కట్టారు ?

ఇపుడిదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. తనపై కక్షకట్టిన జగన్ ను సామాన్య జనాలను వరదల్లో ముంచేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు పదే పదే జగన్ పై తీవ్రస్ధాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అదే విషయాన్ని దేవినేని, ఆలపాటి, వర్ల లాంటి టిడిపి నేతలు ఎల్లోమీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

సరే వాళ్ళ చేస్తున్న ఆరోపణలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు మీడ కక్షకట్టటానికి జగన్మోహన్ రెడ్డికి ఏమిటి అవసరం ? మొన్నటి ఎన్నికల్లో జనాలే చంద్రబాబును చావుదెబ్బకొట్టారు కదా ? మళ్ళీ ప్రత్యేకంగా చంద్రబాబు మీద కక్ష సాధించాల్సిన అవసరం జగన్ కు ఏముంది ? టిడిపి ఎంఎల్ఏలను వైసిపిలోకి లాక్కోవటానికి జగన్ ప్రయత్నాలేమీ చేయటం లేదే. పైగా తమ పార్టీలోకి టిడిపి ఎంఎల్ఏలను తీసుకోవాల్సిన అవసరం లేదనే చెప్పారు కదా ?

ఇక తన భద్రతను తగ్గించేస్తున్నారని చంద్రబాబు చేస్తున్న గోల కూడా కోర్టులో తేలిపోయింది. నిజానికి చంద్రబాబుకు ఇవ్వాల్సిన 53 మంది భద్రతా సిబ్బందికి బదులు తాము 93 మందిని ఇచ్చామని జగన్ ప్రభుత్వం కోర్టులో స్పష్టం చేసింది. కోర్టు కూడా దాన్ని ధృవీకరించింది కదా ? కాబట్టి భద్రతను తగ్గించి కక్షసాధిస్తోందని చంద్రబాబు చెప్పటం కూడా అబద్ధమే.

తన మీద కక్షసాధింపుతోనే జగన్ సామాన్య జనాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఎల్లోమీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసిపి  చేతిలో చావు దెబ్బ తిన్నప్పటి నుండి చంద్రబాబుకు మండిపోతున్నారు.

ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్ ను ఎలాగైనా గబ్బు పట్టించాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చూస్తునే ఉన్నారు. అది సాధ్యం కాకపోవటంతో ఇపుడు కక్షసాధింపులకు దిగుతున్నారంటు జగన్ పై చంద్రబాబు బురదరాజకీయం మొదలుపెట్టారు. నిజానికి చంద్రబాబుపై జగన్ కాదు కక్ష కట్టింది. తనను ఓడించారన్న మంటతో జగన్ పై  చంద్రబాబే కక్షకట్టినట్లుంది చూస్తుంటే.