చంద్రబాబుకు మరో షాక్

చంద్రబాబునాయుడుకు వీర విధేయునిగా ఉన్న జూపల్లి ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం వైసిపిలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశంపార్టీలో నుండి బయటపడాలని జూపూడి డిసైడ్ అయ్యారు.  మరి రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తారు ? చేసేదేముంది వెంటనే వైసిపిలో చేరిపోవటానికి రెడీ అయ్యారు. 

జూపూడి ఏమీ మొదటి నుండి రాజకీయాల్లోనే వ్యక్తి కాదు. టీచింగ్ వృత్తిలో నుండి రాజకీయాల్లోకి వచ్చారు. మాటకారితనం, వాదనా పటిమ లాంటి లక్షణాలతో జగన్మోహన్ రెడ్డి ఆధరణతో వైసిపిలో ప్రముఖ నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున ప్రకాశం జిల్లాలోని కొండెపి అసెంబ్లీకి  పోటి చేసి ఓడిపోయారు.

ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో వెంటనే చంద్రబాబునాయుడుతో మాట్లాడుకుని పార్టీలో చేరిపోయారు. అప్పటి నుండి చంద్రబాబు మెప్పుకోసం జగన్ ను తిట్టింది తిట్టిందే. జగన్ అడుగేసినా తిట్లే, అడుగేయకపోయినా తిట్లే అన్నట్లు సాగింది జూపూడి వ్యవహారం. సీన్ మారిపోయి మొన్నటి ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోయింది. దాంతో జూపూడి టిడిపిలో ఉండలేకపోతున్నారట.

అందుకనే వైసిపిలో చేరటానికి రంగం రెడీ చేసుకుంన్నారు. అంటే జూపూడి వ్యవహారం ఎలాగుందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేస్తానన్నట్లే ఉంది.  వైిిసిపిలో చేరిన తర్వాత వెంటనే చంద్రబాబును తిట్టటానికి నిసిగ్గుగా మీడియా ముందుకొచ్చేస్తారనటంలో సందేహం లేదు.