చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. రైతు రుణమాఫీ అనే చంద్రబాబు తప్పుడు హామీకి జగన్ మంగళం పాడేశారు. జీవో నెంబర్ 38ని రద్దు చేస్తు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులివ్వటంతో చంద్రబాబు హామీని నెరవేర్చాల్సిన అవసరం తమకు లేదని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పినట్లైంది.
2014లో రైతు రుణమాఫీ అనే తప్పుడు హామీతో రైతులను చంద్రబాబు మోసం చేసి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి రాగానే తానిచ్చిన హామీకి చంద్రబాబే తూట్లు పొడిచిన విషయం అందరూ చూసిందే. అధికారంలో ఉన్నంత కాలం తప్పుడు ప్రకటనలతో మోసం చేసిన చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో రైతులు గట్టిగా బుద్ధి చెప్పారు.
2019 ఎన్నికల సమయంలోనే రైతు రుణమాఫీ చేసేసినట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. అయితే అప్పటికే చంద్రబాబు మోసంతో మండిపోతున్న రైతులెవరూ చంద్రబాబు మాటలు నమ్మలేదు. సరే అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత 4, 5 విడతల రుణమాఫీని జగన్ అమలు చేయాలంటూ చంద్రబాబు పట్టుపట్టారు. తానిచ్చిన హామీని జగన్ ఎందుకు అమలు చేయరంటూ పనికిమాలిన లాజిక్కులు కూడా మొదలుపెట్టారు.
అయితే చంద్రబాబు గోలను లెక్క చేయని జగన్ తాజాగా చంద్రబాబు హామీతో తమకు సంబంధం లేని చెబుతూ ఉత్తర్వులను కూడా జారీ చేసేశారు. దాంతో రైతులకు అందాల్సిన 4,5 విడతల సొమ్ము ఆగిపోయింది. దాంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. అందుకనే జగన్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తానిచ్చిన హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు అదే హామీని జగన్ అమలు చేయాలని డిమాండ్ చేయటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.