చంద్రబాబుకు జగన్ మొదటి షాక్

ఎప్పుడు తాను కలల్లో ఉంటూ జనాలను భ్రమల్లో ముంచే చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి మొదటి షాక్ ఇచ్చారు. కృష్ణానదిపై గొల్లపూడి వద్ద చంద్రబాబు నిర్మించాలని అనుకున్న కలల ఐకానిక్  బ్రిడ్జికి జగన్ మంగళం పాడేశారు. ఐకానిక్ వద్దు పాడూ వద్ద జనాలకు సౌకర్యంగా ఉండే బ్రిడ్జి చాలని డిసైడ్ చేసి కేంద్రానికి చెప్పేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే గొల్లపూడి గ్రామం వద్ద కృష్ణానదిపై 3.5 కిలోమీటర్ల పొడవుతో 6 వరసల బ్రిడ్జిని కట్టాలని చంద్రబాబు అనుకున్నారు. సరే చంద్రబాబు ఏదనుకున్నా వరల్డ్ క్లాస్, ప్రపంచంలోనే మొదటిది ఇలాంటి పడికట్టు పదాలు వాడటమే మామూలే కదా ? అదే పద్దతిలో నదిపై ఐకానిక్ బ్రిడ్జి కట్టాలని నిర్ణయించారు. వెంటనే కేంద్రానికి రూ 800 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. కేంద్రం వద్దని చెప్పింది. చంద్రబాబు వినలేదు.

సరే అని చంద్రబాబు ప్రతిపాదనలకు అంగీకరిస్తునే మొత్తం వ్యయంలో రూ. 400 కోట్లను రాష్ట్రప్రభుత్వాన్నే భరించమని షరతు విధించింది. దాంతో చంద్రబాబుకు దిమ్మతిరిగింది. ఎందుకంటే ఖజానాలో రూపాయి కూడా లేదు. జేబులో రూపాయి కూడా లేకపోయినా ఆకాశానికి నిచ్చెనలేయటం చంద్రబాబుకు అలవాటే కదా ? ఎప్పుడైతే కేంద్రం రూ. 400 కోట్లను భరించమని చెప్పిందో తర్వాత మళ్ళీ ఐకానిక్ ఊసే ఎత్తలేదు.

మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ఈ విషయాన్ని పరిశీలించారు. ఐకానిక్ అవసరం లేదని జనాలకు సౌకర్యంగా ఉండే 6 వరసల మామూలు బ్రిడ్జి నిర్మిస్తే చాలని రాత మూలకంగా చెప్పారు. జగన్ తాజా లేఖతో గొల్లపూడి మీద 6 వరసల బ్రిడ్జి నిర్మించటానికి కేంద్రప్రభుత్వం  రెడీ అవుతోంది.