చంద్రగ్రహణమా.. లేక జగన్మోహనం కావాలా అంటూ పివిపి కామెంట్ ?

 

జగన్మోహనం కావాలా.. లేక చంద్రగ్రహణమా ఏది కావాలో మీరే తేల్చుకోండి ప్రజలారా అంటూ సినీ నిర్మాత వై కాపా నేత పివిపి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ రోజు అయన ట్విట్టర్ లో ఈ కామెంట్ పెట్టారు. చంద్ర గ్రహణమా. లేక జగన్మోహనం కావాలా అంటూనే పెన్షన్ విషయంలో స్పందించారు. ఇంటింటికి పెన్షన్ పంపించే ప్రభుత్వం కావాలా .. లేక ఉద్యోగులను నిరుద్యోగులుగా మర్చి ఇంటికి పంపే ప్రభుత్వం కావాలా అంటూ చంద్ర గ్రహణమా. . లేక జగనమోహనం కావాలా ? అంటూ కామెంట్ పెట్టడం రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

పొట్లూరి వరప్రసాద్ ( పివిపి ) వ్యారపరంగం నుండి సినిమా రంగంలోకి వచ్చారు. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన పివిపి రాజకీయాలవైపు అడుగులు వేశారు. వ్యాపారాలకు, సినిమాలకు దూరంగా ఉంటూ .. కేవలం రాజకీయాల్లో మాత్రమే బిజీగా ఉన్న అయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులు దూరంగా ఉన్న అయన మళ్ళీ రాజకీయాల్లో బిజీగా ఉంటూ, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటినుండే వచ్చే ఎన్నికలకోసం వామప్ చేస్తున్నాడంటూ ప్రత్యర్ధ రాజకీయ నేతలనుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ టిడిపి తో పాటు చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ పలు షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన పధకాలను దగ్గరుండి మరి ప్రజలకు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా పింఛన్ కార్యక్రమం పై పివిపి తనదైన స్టైల్ లో స్పందించారు. ఈ మద్యే కృష్ణా కరకట్టపై రైటనింగ్ వాల్ కోసం ప్రభుత్వం 126 కోట్లకు విడుదల చేసింది అంటూ కామెంట్ పెడుతూ .. కృష్ణలంక కరకట్ట వాసుల కల నెరవేర్చారని అన్నారు.