కోడెలకు గుండెపోటు ?

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటో వచ్చింది. అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం వ్యవహారంలో పీకల్లోతు కష్టాల్లో కోడెల ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఫర్నీచర్ దొంగతనం కేసు విషయంలో ఈరోజో రేపే అరెస్టవ్వటం ఖాయమన్నట్లే ఉంది పరిస్ధితులు. దొంగతనం కేసులో భాగంగానే కొడుకు కోడెల శివరామకృష్ణపై గుంటూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఇప్పటికే చాలా కేసులను ఎదుర్కొంటున్న శివరామ్, కూతురు విజయలక్ష్మిలను పోలీసులు ఏ నిముషంలో అయినా అరెస్టు చేయచ్చనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో ఫర్నీచర్ దొంగతనం కేసులో తండ్రి, కొడుకులు ఇరుక్కున్నారు.

శుక్రవారం కొడుకుపై క్రిమినల్ కేసు నమోదు కాగానే శివరామ్ అరెస్టు ఖాయమని తేలిపోయింది. కొడుకు అరెస్టయితే కోడెల అరెస్టు కూడా తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో సత్తెనపల్లిలోని తన ఇంట్లో కోడెలకు గుండెపోటు వచ్చిందని సమాచారం. వెంటనే కూతురు విజయలక్ష్మి కి చెందిన క్లినిక్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.