కేసీఆర్, జగన్ స్నేహం టీ, టిఫిన్ల వరకేనా ?

YS Jagan and KCR GO Number 203
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో స్నేహం అవసరం అంటూ కేసీఆర్ తో స్నేహానికి సుముఖత చూపారు.  కేసీఆర్ సైతం జల సమస్యలను పరిష్కరించుకుందాం అంటూ జగన్ ను హైదరాబాద్ ఆహ్వానించారు.  ఇలా ఇద్దరూ పలుమార్లు తేనీటి విందుకు, అల్పాహార విందుకు కలుసుకుని ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకున్నారు.  ఆ సమావేశాల్లో ఏయే అంశాలు చర్చకు వచ్చాయో బయటకు చెప్పలేదు కానీ అసెంబ్లీ సాక్షిగా ఇరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు పొగుడుకున్నారు. 
 
ఇది చూసిన జనం ఈ స్నేహం ఫెవికాల్ బంధం కంటే గొప్పదని, ఇకపై ఇరు రాష్ట్రాల నడుమ సమస్యలు ఉండవని అనుకున్నారు.  కానీ ఇంతలోనే శ్రీశైలం నీటి వాటల్లో డెబ్బలాట మొదలైంది.  అసలు కేసీఆర్ ను అంతలా గౌరవించే జగన్ జీవో విడుదల చేసేముందు ఒక్కసారి ఆయనకు ఫోన్ చేసి ఇలా ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటున్నాం, తెలంగాణ వాటాను వాడుకోము అని ఒక మాట చెబితే అసలు ఇంత గొడవే ఉండేది కాదు. 
 
సరే జగన్ చెప్పకపోయినా జీవో విషయం తెలియగానే కేసీఆర్ ఫోన్ చేసి జీవోలలో సమస్యలు ఉన్నాయి అని అడిగి ఉన్నా, ఇరు రాష్ట్రాల జల మంత్రులు ముఖాముఖీ మీటింగ్ పెట్టుకున్నా సమస్యకు పరిష్కారం ఎప్పుడో దొరికేది.  కానీ ఇరువురూ ఒకరితో ఒకరు ప్రాపర్ కాంటాక్ట్ లేకుండా సమస్యను జనం మధ్యలో పెట్టి పెద్దది చేస్తున్నారు. ఇతర పార్టీలు గొడవలో చొరబడుతుంటే చోద్యం చూస్తున్నారు.  దీన్నిబట్టి రాజకీయం అంటే ఇంతే అనుకోవాలో లేకపోతే కేసీఆర్, జగన్ స్నేహం టీ, టిఫిన్ల వరకే పరిమితం అనుకోవాలో మరి. 
 
Why KCR, YS Jagan not discussing directly