కేంద్ర బడ్జెట్ 2020.. ముఖ్యంశాలు 1

కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాది బడ్జెట్ ని ఈ రోజు ప్రవేశ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మూడు ప్రాధాన్యతలను ప్రకటించింది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట, రైతుల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ చెబుతుంది. స్వచ్ఛ భారత్ , జల్ జీవన్ మిషన్లకు కేటాయింపులు చేసారు. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ప్రతిపాదనల్లోని ముఖ్యంశాలు ఏమిటో చూద్దాం.

@ వ్యవసాయ రంగానికి 2. 83 లక్షల కోట్లు
@గ్రామీణ అభివృద్ధికి 1 లక్షల కోట్లు
@ వ్యవసాయ రుణాల లక్ష్యం ( ఈ ఏడాదిలో ) 15 లక్షల కోట్లు
@స్వచ్ఛ భరత్ మిషన్ కోసం 12, 300 లక్షల కోట్లు
@ జల్ జీవన్ మిషన్ కోసం 3. 06 లక్షల కోట్లు
@ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పధకానికి 6, 400 కోట్లు
@ ఆరోగ్య రంగానికి 69 వేల కోట్లు,
@ విద్యా రంగానికి 99, 300కోట్లు,
@ నైపుణ్యాభివృద్ది కేంద్రాలకు 3 వేల కోట్లు,
@ కొత్తగా 16 లక్షల మంది పన్నులు చెల్లించారు
@ ఇప్పటి వరకు 40 కోట్ల జి ఎస్ టి దాఖలు
@ జి ఎస్ టి ని ప్రవేశ పెట్టాకా పన్ను విధానంలో పారదర్శకత
@ ప్రజల నెలవారీ ఖర్చులో 4శాతం మిగులు
@ షబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మా లక్ష్యం
@ 2006 నుండి 2016 మధ్య పేదరికం నుండి 22 కోట్ల మంది బయటపడ్డారు .. ఇలా మొత్తంగా వందకుపైగా సమస్యల పరిష్కారాలు, కొత్త ఆచరణలతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టారు ..