ఆంధ్రప్రదేవ్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచనం రేపుతోంది కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి, తాను తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం లేఖ ద్వారా ప్రకటించారు. తను తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక గల కారణాలను కూడా వివరించారు మద్రగడ.
ఇటీవల తన పై సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తున్నారని, తన పై దారుణంగా విమర్శలు గుప్పిస్తున్నారని, తనను కుల ద్రోహి, గజదొంగ వంటి, వ్యాఖ్యలతో విమర్శిస్తూ, తనను కాపుద్రోహిగా చిత్రీకరిస్తున్నాని ముద్రగడ పద్మనాభం తెలిపారు. దీంతో ఈ పరిణామాలు తనకు తీవ్రమనస్థాపం కల్గించాయని తెలిపారు. ఇలాంటి విమర్శలు కారణంగానే తాను కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు.
ఇక ఈ కాపు ఉద్యమాన్ని మేధావులతో కలిసి నడిపించానని, అయితే ఈ ఉద్యమం కారణంగా తాను ఆర్ధికంగానూ, రాజకీయంగానూ, ఆరోగ్య పరంగానూ తీవ్రంగా నష్టపోయానన్నారు. ఏ ఉద్యమం అయినా అప్పటి రాజకీయ పరిస్థితులు బట్టి సందర్భాను సారంగా రూపురేఖలు మార్చుకుంటుందని, అంత మాత్రాన తాను రోజుకో మాట్లాడుతున్నానని విమర్శలు చేయడం కరెక్ట్ కాదని.. తాను చేతులెత్తేసి, కాపు ఉద్యమాన్ని కేంద్రం కోర్టులో వేశాననడం బాధేస్తోందని ముద్రగడ తెలిపారు.