ఒక్క రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కేసుల్లో ఉరి శిక్ష విధింపు!

ఇటీవల కాలంలో పెచ్చు మీరిన హత్యాచారాల సంఘటనల నేపథ్యంలో గురువారం ఒక్క రోజునే తెలంగాణలో ఒకరికి ఆంధ్ర ప్రదేశ్ లో ఒకరికి కోర్టులు ఉరి శిక్ష విధించడం సంచలనం సృష్టించింది.

తెలంగాణ యాదాద్రి జిల్లాలో గతేడాది ఏప్రిల్ నెలలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన శ్రీనివాసులు రెడ్డికి నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం ఉరి శిక్ష విధించింది. శ్రావణి కల్పన మనీషా అనే ముగ్గురు మైనర్ బాలికలకు లిప్టు ఇస్తానని నమ్మించి హత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువు అయినందున ఉరి శిక్ష విధించడం జరిగింది.ఇందులో మనీషా కేసుకు చెంది యావజ్జీవ శిక్ష విధించింది. మిగిలిన ఇద్దరు బాలికల హత్యాచారానికి ఉరి శిక్ష కోర్టు విధించింది. ఈ కేసు సందర్భంగా 101 మంది సాక్షులను కోర్టు విచారణ చేసింది. విచారణ 90 రోజుల్లో పూర్తి చేసింది.

అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరులోని హరనాథ పురంలో 2013 లో మెడికో భార్గవి ఆమె తల్లి శకుంతల ను హత్య చేసిన ఇంతియాజ్ కు నెల్లూరు జిల్లా కోర్టు గురువారం ఉరి శిక్ష విధించింది. ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి ఉరి శిక్షలు విధించడం విశేషం. కాగా ఇటీవల తెలంగాణలో ఒక మహిళ హత్యాచారం కేసులో కూడా ముగ్గురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. అంత క్రితం తెలంగాణలో దేశం మొత్తం మీద దుమారం కలిగించిన దిశ హత్య కేసులో నిందితులు ఎన్ కౌంటర్ కావడం విదితమే.

ఒక పక్క కోర్టులు హత్యాచారాల సందర్భంగా ఉరి శిక్షలు విధించుతూ వుంటే కరుడు కట్టిన నేరస్తులకు చీమ కట్టినట్లు కూడా లేదు. నెల్లూరులో కోర్టు ఉరిశిక్ష విధించిన గురువారమే ఒక స్కూలు వ్యాన్ డ్రైవర్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు