ఏపీపై కేంద్రం జోక్యం… హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advisory committee requests YS Jagan 

పేదలకు భూములు అంటూ ప్రభుత్వం చేస్తోన్న హడావిడి, అతిపై హై కోర్టు మొట్టి కాయలు వేసింది. భూమి లేని నిరుపేదల పేరు చెప్పి గతంలో ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని తీసుకుని మళ్లీ పేదలకు అసైన్డ్‌ చేయడం ఎందుకు?‌కు అంటూ తలంటి పోసింది. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలను ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పేదలకు ఇవ్వాలనుకుంటే మీ(ప్రభుత్వం) జేబు నుంచి ఇవ్వండి, రైతుల నుంచి తీసుకున్న భూముల నుంచి కాదని ఘాటుగా స్పందించింది. సీఆర్‌డీఏ చట్టంలో నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకుని మిగిలిన వాటిని విస్మరిస్తామనడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. భూమిని ఇష్టానుసారంగా కేటాయించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పేసింది.

ఇళ్ల స్థలాలకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూముల్ని అధికారులు బలవంతంగా తీసుకోవడాన్ని ఆపాలని, ప్రభుత్వ భూమిలో ఉంటూ పట్టాలు లేని పేదలను ఖాళీ చేయించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ‘కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతున్న హై కోర్టు.. తాజాగా తమకు సమర్పించిన ఫొటోలను చూస్తుంటే బలవంత భూసమీకరణ చేస్తున్నట్లు స్పష్టమవుతుందని తేల్చింది. చెట్లు కొట్టేయడం నేరం, అందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశిస్తామని పేర్కొంది.

ధర్మాసనం వేసిన ప్రశ్నలకు ఏజీ శ్రీరాం బదులిచ్చారు. భూముల్ని వెనక్కి తీసుకున్నందుకు పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజా ప్రయోజనం కోసం భూములను తీసుకోవచ్చని కూడా వివరించారు. అయితే వాటికి సంబంధించిన రికార్డులన్నిటినీ ధర్మాసనం ముందుంచాలని న్యాయస్థానం ఏజీని ఆదేశించింది.

విశాఖ జిల్లాలోని దొండపూడి గ్రామంలో తమ వ్యవసాయ భూముల్లో తహసీల్దారు జోక్యం చేసుకోవడాన్ని నిలువరించాలని కోరుతూ 74 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం రెవెన్యూ, పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. పంటను ధ్వంసం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది, అసలు పోలీసుల సహకారంతో భూములను స్వాధీనం చేసుకోవాల్సిన అవరసం ఏమొచ్చింది? తీవ్రమైన నేరం జరిగితేనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లాలి. అలా ఏమీ లేనప్పుడు పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లారు? పోలీసుల తీరు ఇలా ఉంది కాబట్టే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాం.. అని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రకటన జారీ అయిన నేపథ్యంలో ఇళ్ల స్థలాలను కేటాయించొద్దని సూచించింది. విచారణను వాయిదా వేసింది.