ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి వేణుగోపాల కృష్ణ గా సాగుతున్న వ్యవహారం ముదిరి పాకానపడినట్లే ననే కామెంట్లు తెరపైకి వచ్చాయి. దీంతో జగన్ అలర్టయ్యారు.
అవును… రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజుకున్న వైసీపీలోని టిక్కెట్ల పంచాయతీపై జగన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… చినికి చినికి గాలివాన కాకముందే కంట్రోల్ లోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లి సుభాస్ ని జగన్ తన ఆఫీసుకుని పిలిపించుకుని కాస్త గట్టిగానే చర్చించారని తెలుస్తుంది.
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ని క్యాంప్ కార్యాలయానికి పిలిపించిన జగన్… గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టాలని హితవు పలికారని తెలుస్తుంది. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలోనే ఎంపీ పిల్లి సుభాష్ కి జగన్ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… పిల్లి సుభాష్ తనయుడు సూర్యప్రకాశ్ టికెట్ విషయం తనకు వదిలేయాలని జగన్ సూచించారని అంటున్నారు.
ఈ సందర్భంగా పార్టీయే ఫైనల్ అనే విషయాన్ని వీలైనంత క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారంట జగన్. దీంతో… పిల్లి సుభాష్ చంద్రబోస్ ని దూరం చేసుకోవడం సీఎం జగన్ కి ఇష్టంలేదని.. అలాగని ఆయన కుమారుడికి రామచంద్రాపురం టికెట్ ఇచ్చి.. మంత్రి వేణుగోపాల కృష్ణ వర్గాన్ని చెడ్డ చేసుకోలేరని అంటున్నారు పరిశీలకులు.
అందుకే పార్టీకి నమ్మకంగా ఉన్న ఎంపీ పిల్లి సుభాష్ ని పిలిపించుకుని మరీ మాట్లాడారని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన కోసం పార్టీ ఇప్పటివరకూ ఏమేం చేసిందో, ఎంతగా గౌరవించిందో వివరించారని తెలుస్తుంది. అదేవిధంగా… ఆయన కొడుకు విషయంలో కూడా తాను అంతే బాధ్యతగా ఉంటానని చెప్పిన జగన్… మంత్రి వర్గంతో కలసి పనిచేయాల్సిందేనని క్లారిటీ ఇచ్చి పంపించారని అంటున్నారు.
దీంతో… వ్యవహారం మరింత ముద్రకముందే జగన్.. ఆర్సీపురం వ్యవహారాన్ని ఒక కన్ క్లూజన్ కి తీసుకొచ్చారని. నాలుగు రోజులు సైలంట్ గా ఉటంఏ అన్నీ సద్దుమణిగిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారంట పరిశీలకులు.