కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న పురోహితులకు జగన్ ప్రభుత్వం పెద్ద మనసుతో ఇదివరకే ఆర్థిక సాయం చేసింది. అయితే జనసేన అధినేత మన మన పవన్ కల్యాణం సర్ మాత్రం, జగన్ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేశాక, తీరిగ్గా పురోహితులను ఆదుకోవాలంటూ ఇటీవల ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టడం అంటే ఇదేనేమో. ఇక పురోహితుల పై పవన్ కల్యాణ్ కపట ప్రేమ చూపుతున్నారని దీని పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ‘ఇదివరకే సాయం ప్రకటించాకా మళ్లీ డిమాండ్ ఏంటండీ బాబు.. కామెడీ కాకుంటే..’, లక్షల పుస్తకాలు చదివి ఉన్నమతి పోయిందా అని పవన్ ను ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో కూర్చున్న పవన్ కళ్లకు సంక్షేమ పథకాల పంపిణీ కనబడటం లేదేమో అని అన్నారు. పార్ట్ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిదని ఆయన సూచించారు.
మరి ఈ విమర్శల పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో. అయినా పవన్ ఇలాంటి స్టేట్ మెంట్స్ చాలానే ఇస్తారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పవన్.. లేటెస్ట్ అప్ డేట్స్ ఫాలో అవ్వడా.. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది..? అనే విషయాల పై అప్ డేట్ లేకుండా ప్రజలు ఇబ్బందులే వింటూ కూర్చుంటే ఎలా..? ఆ ఇబ్బందులను ప్రభుత్వం తీరుస్తూ పోయాక వాటి పై పోరాటం చేస్తా అంటే పాపం కామెడీగా ఉంటుందని పవన్ కళ్యాణ్ కి కూర్చోపెట్టి చెప్పండయ్యా బాబు.