’అమ్మఒడి’ సూపర్ సక్సెస్ అయినట్లే

జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబానాయుడు మీడియానే ధృవీకరిస్తోంది. జగన్ ఏమి చేసినా చేయకపోయినా తప్పులను మాత్రమే కాగడా వేసి వెతికిపట్టుకునే మీడియా అమ్మఒడి పథకం గురించి బ్రహ్మాండంగా రాయటమే విశేషమే.

ఈ పథకం వల్ల ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయట. పథకం వల్ల ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బందులు మొదలైనట్లు ఎల్లోమీడియానే చెప్పింది. ఈ ఏడాది ప్రారంభమైన అడ్మిషన్లలో ప్రైవేటు స్కూళ్ళ నుండి ప్రభుత్వ స్కూళ్ళల్లోకి వేలాది మంది విద్యార్ధులు మారిపోయారట. ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న మౌళిక సదుపాయాలు, పాఠాలు బాగా చెబుతుండటంతో ఫలితాలు కూడా మెరుగవతున్నాయట. దాంతో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేందుకు విద్యార్ధులు మొగ్గు చూపుతున్నట్లు రాసింది.

ఈ ఏడాది అడ్మిషన్లలో ప్రైవేటు స్కూళ్ళ నుండి ప్రభుత్వ స్కూళ్ళలో 1,91,152 మంది విద్యార్ధులు చేరారట. అలాగే ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు స్కూళ్ళకు 35,722 మంది వెళ్ళిపోయారట. ప్రైవేటు స్కూళ్ళ నుండి ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరుతున్న విద్యార్ధుల్లో ఎక్కువగా హై స్కూళ్ళల్లోనే చేరుతున్నారంటూ రాసింది.

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టటంతో పాటు బోధన బాగుంటుందనటంలో సందేహం లేదు. దాంతో ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు కూడా నిలుస్తున్నాయి. అన్నింటికి మించి మౌళికసదుపాయాలు కూడా మెరుగవుతున్నాయి. అన్నింటికి మించి జగన్ అమ్మఒడి పథకం ద్వారా విద్యార్ధుల తల్లులకు వేల రూపాయలు చెల్లిస్తానని హామీ ఇవ్వటంతో ప్రభుత్వ స్కూళ్ళని విద్యార్ధులతో కళకళలాడుతున్నాయి. మొత్తానికి నవరత్నాల్లో ఒకటి సూపర్ సక్సెస్ అయినట్లే.

ఫొటో : ఈనాడు సౌజన్యంతో