అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకం పై పలు విమర్శలు వస్తున్నాయి. అమ్మ ఒడి పేరిట డబులిచ్చి . బడిలోనూ రౌడీ వసూళ్లేనా అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. అమ్మ ఒడి పేరిట అమ్మలనూ బెదిరించి 1000 రూపాయలు వసూలు చేయడం ఏమిటి ? ఇవ్వకపోతే మొత్తం 15 వేలు ఆపేస్తాం అని భేదిరిస్తారా ? ఆ అధికారం మీకు ఎక్కడిది? పేదల జీవితాలతో ఎందుకు ఇలా ఆదుకుంటుంన్నారు అంటూ మండి పడ్డారు చంద్రబాబు. అమ్మల నుండి
వసూలు చేస్తే 1000 రూపాయలకు బిల్లు కూడా ఇవ్వడం లేదు అంటూ ఆ డబ్బు వై సిపి నేతల జేబుల్లోకి వెళుతున్నాయా? ఇదేం రౌడీ రాజ్యం ? లెక్కా పత్రం లేకుండా ఈ వసూళ్లు ఏమిటని ప్రశ్నిచారు.

బడుల నిర్వహణ ఖర్చు పేరుతొ పిల్లల దగ్గర కమిషన్స్ కొట్టేసే దొంగ మామలను ఇప్పుడే చూస్తున్నామని, బిడ్డలూ .. అమ్మలూ కాస్త జాగ్రత్త అంటూ హెచ్చరించారు బాబు. రాజలసీమను అభివృద్ధి చేయాలంటే కియారా లాంటి 30 పరిశ్రమలను తెప్పించు, అంతే కాను మూడు రాజధానులెందుకు అంటున్నారని, మూర్ఖుడు తాను పట్టిన కుందేలుకు మూడే కళ్ళు అంటాడని పెద్దలు చెప్పిన మాట మన కళ్ళముందే మూడు రాజధానుల రూపంలో రుజువు అయిందంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. మండలి రద్దు పై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు మండలిలో యాభై శతం మంది బలహీన వర్గాల ప్రతినిధులు ఉన్నారని, వారందరిని జగన్ అన్యాయం చేసారని అన్నారు. మండలిని తండ్రి పునరుద్ధరిస్తే .. కొడుకు కూల్చేశాడు అంటూ మండి పడ్డారు.