అంటే అవుననే అంటున్నారు అక్కడి పార్టీ నేతలు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో .. జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకే బలం చేకూరింది అనే వాదన బలంగా వినిపిస్తుంది. అయితే అంతకుముందు ఎపి లో బిజెపి కు ఎలాంటి ప్రాముఖ్యత అయితే లేదన్నది అందరికి తెలిసిన విషయమే. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి .. ఇక్కడ కూడా పార్టీ ని బలోపేతం చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే సొంత అధికార పార్టీ నేతలే ఈ విషయంలో చప్పుడు చేయకుండా ఉండడం .. టిడిపి ఉంది బిజెపి లోకి వలసలు పెరగడంతో ఆ పార్టీలో ఇప్పటికే ఉన్న సీనియర్స్ .. తాజాగా పార్టీలోకి జంప్ అయిన వాళ్ళ మధ్య పొరపొచ్చాలు వచ్చాయని సమాచారం.
టిడిపి నుండి సుజనా చౌదరి , సి ఎం రమేష్, టి జి వెంకటేష్ లాంటి నాయకులూ బిజెపిలోకి వెళ్లడంతో .. బిజెపి వర్గాల్లో ఓ రకమైన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ ముగ్గురు నాయకులూ బిజెపి లోకి వెళ్లడం వల్లే సేఫ్ అయ్యారన్న వాదన ఉంది. మొత్తానికి బిజెపి లో వేళ్ళు కలిసినా కూడా వీళ్ళ వ్యవహారం మాత్రం పార్టీకి అతీతంగా ఉండడంతో .. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ను కలిసి ఏదైనా సమావేశంలో కలిసి మాట్లాడుకున్న సందర్భాలు లేవు కాబట్టి .. ఇక్కడ ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా మారింది పరిస్థితి. దాంతో ఇప్పటికే రాజకీయ వర్గాల్లో బిజెపి పార్టీ రెండుగా చీలిపోతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఆ పార్టీ లీడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.