అందుకే జెడి లక్ష్మి నారాయణ రాజీనామా చేసారా ?

సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయా వర్గాల్లో సంచలనం రేపింది. అయన ఎందుకు ఇంత సడన్ గా రాజీనామా చేసారు? అసలు రాజీనామా చేయాడానికి జెడి కి వచ్చిన కొత్త చిక్కులు ఏమిటి ? జనసేన పార్టీలో అయన ప్రాధాన్యత తగ్గిందా ? రాజీనామా తరువాత అయన నెక్స్ట్ ప్లాన్ ఏమిటి ? అంటూ కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. అసలు జెడి రాజీనామా తరువాత భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే జెడి సమాధానం చెప్పాల్సిందే.

2018 లో స్వచ్చందంగా సి బీఐ జెడి గా పదవి బాధ్యలనుండి తప్పుకున్న లక్ష్మి నారాయణ సొంతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అప్పట్లో సొంత పార్టీ పెట్టాలని సన్నాహాలు కూడా చేసారు కానీ ఆ తరువాత లోక్ సత్తా పార్టీలో చేరాలని జయప్రకాశ్ నారాయణ కోరారు, కానీ అయన ఎవరు ఊహించని విధంగా 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. విశాఖ నుండి జనసేన పార్టీ తరపున ఎంపీ గా ఫొటి చేసి ఓడిపోయారు. తాజాగా జనసేన పార్టీ మూడు రాజధానుల అంశాన్ని లక్ష్మి నారాయణ సమర్ధించారు. అయితే జనసేన పార్టీ మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తే ఊరుకోమని జనసేన హెచ్చరించిన నేపథ్యంలో జెడి లక్ష్మి నారాయణ బయటికి రావడం పలు సందేహాలకు తావిస్తుంది. జెడి లక్ష్మి నారాయణ పార్టీ విడిపోవడం విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2014 లో విశాఖ నుండి బిజెపి అభ్యర్థి హరిబాబు గెలిచారు. ఆ తరువాత 2019 లో బిజెపి అభ్యర్థి పురందరేశ్వరి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తరపున మళ్ళీ జెడి పోటీ చేయాలనీ ట్రై చేయాలనుకుంటే ఇప్పటికే జనసేన పార్టీ బిజెపి తో పొత్తు పెట్టుకుంది .. దాంతో విశాఖ సీటు విషయంలో అంచనాలు తారుమారు అయితే జెడి లక్ష్మి నారాయణ పరిస్థితి ఏమిటి అన్నది సందేహంగా మిగిలింది. అందుకే ముందు జాగ్రత్తగా అయన పార్టీ నుండి విడిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.