అంగరంగ వైభవంగా మొదలైన తెలంగాణ కుంభమేళా

తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జరాతకు వచ్చే భక్తులకోసం అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసింది. ఎవరికీ అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే అక్కడి ప్రాంతంలో తాగు నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టారు. రోడ్ల మరమత్తులు పూర్తీ కావొచ్చాయి. వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా 1500 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అమ్మవారి గద్దెల దగ్గర తొక్కిసలాట జరగకుండా అక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసారు.

అలాగే జాతరకు వచ్చే భక్తులు భక్తి భావంతో జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీ పడతారు, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసింది. దాంతో పాటు జాతరలో ఎవరు అనారోగ్యానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు అక్కడ మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసారు. అలాగే అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. సమ్మక్క, సారలమ్మ లను భక్తి ప్రపత్తులతో కొలిచే భక్త జనం కోసం తాత్కాలిక టెంట్లు కూడా ఏర్పాటు చేసారు.

తెలంగాణ పర్యాటక శాఖా ఆధ్వర్యంలో ప్రజలు ఉండడానికి భారీగా కాటేజీల నిర్మాణం కూడా చేపట్టారు. జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలనుండి జనాలు వస్తారు కాబట్టి వివిధ ప్రాంతాలనుండి మేడారానికి 500 కుపైగా ప్రత్యేక బాసులు వేసినట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటిచింది. ఇప్పటికే పలు ప్రయివేట్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక వాహనాలను నడిపిస్తున్నారు. ఇక ప్రభుత్వం తాజాగా హిలికాప్టార్ సర్వీస్ ను మొదలెట్టింది. హైద్రాబాద్ నుండి మేడారానికి ఈ హెలికాఫ్టర్ సర్వీస్ లను మొదలెట్టింది. ఒక్కో మనిషికి 30 వేల చొప్పున వసూలు చేస్తుంది. ఈ మేడారం జాతర ఈ నెల 9 వరకు కొనసాగుతుంది.